కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయానికి ఆక్సిజన్ దొరక్క మృత్యువాత పడుతున్నారు. కరోనా, లాక్ డౌన్ లతో అల్లాడిపోతున్న వారికి ఓ ధైర్యం, భరోసా అందివ్వాలి. ఇప్పుడు రేణుదేశాయి ఇదే చేస్తోంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో రేణుకి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. అయితే ఈ ఫాలోయింగ్ ను కరోనా రోగులకు సాయం చేసే విధంగా వాడుకుంటుంది రేణు.
రీసెంట్ రేణు ఓ చిన్న టీమ్ ను ఏర్పాటు చేసింది. ఉదయం లేచిన దగ్గర నుండి, రాత్రి పడుకునే వరకు రేణు తన టీమ్ తో టచ్ లో ఉంటూ.. ఎక్కడెక్కడ ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి..? అవి ఎవరికి అవసరం ఉన్నాయి..? వాటిని పేషంట్స్ వద్దకు ఎలా చేర్చాలి..? ఇలాంటి పనులన్నీ కూడా ఫోన్ ల ద్వారానే చేస్తుంది రేణు. దానికోసం 18 గంటలు పనిచేయాల్సి వస్తోందట. తనకు రోజులో వందలాది మెసేజ్ లు వస్తున్నాయని..
వీలైనంత వరకూ ప్రతీ మెసేజ్ కు సమాధానం ఇస్తున్నానని చెప్పింది రేణు. ఆక్సిజన్ సిలిండర్లు కావాలని కొంతమంది, హాస్పిటల్ లో బెడ్స్ దొరకడం లేదని కొందరు, తిండి దొరకడం లేదని మరికొందరు ఎవరి సమస్యలు వాళ్లు చెప్పుకుంటున్నారని.. అవన్నీ కూడా తన టీమ్ కు పంపించి.. ఎవరికి సాయం కావాలో అందిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తనకు దాతలు సాయం చేస్తున్నారని.. ప్రతీ రోజూ ఒక్కరికైనా సహాయం అందివ్వగలిగితే చాలనిపిస్తోందని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.