Renu Desai: రేణు దేశాయ్ ను ఆంటీ అన్న హీరో డాటర్.. నటి రిప్లై ఇదే!

సినీ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అవుతూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవ్వడమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక బ్లూ కలర్ శారీలో ఎంతో అందంగా ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినటువంటి ఎంతోమంది రేణుదేశాయ్ ఎంతో అందంగా ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పై ఒక స్టార్ డాటర్ ఏకంగా ఆంటీ అంటూ కామెంట్ చేశారు. ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుమార్తె పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ అమ్మాయి (Renu Desai) రేణు దేశాయ్ పోస్ట్ పై స్పందిస్తూ సో బ్యూటిఫుల్ ఆంటీ అంటూ కామెంట్ చేశారు. ఇలా ఈమెను ఆంటీ అంటూ కామెంట్ చేయడంతో ఈమె ఈ కామెంట్ పై స్పందిస్తూ థాంక్యూ బేబీ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక నటుడు ఉత్తేజ్ మెగా ఫ్యామిలీకి ఎంత పెద్ద అభిమానో మనకు తెలిసింది. ఈయన మెగాస్టార్ చిరంజీవి అన్న ఆయన ఫ్యామిలీ అన్న ఎంతో ఆరాధిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఉత్తేజ్ కుమార్తె పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ ను ఆంటీ అని సంబోధిస్తూ కామెంట్ చేయగా ఈమె కూడా చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. ఇక రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన కెరియర్ గురించి తన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus