Renu Desai: పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రేణు దేశాయ్?

రేణు దేశాయ్ నటిగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇకపోతే రేణు దేశాయ్ ఎక్కువగా ఇండియాలోనే పలు ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళుతూ దైవదర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఈమె ఇతర దేశాలకు హాలిడే వెకేషన్ వెళ్లడం చాలా అరుదు.తాజాగా రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొడుకు అకీరా కూతురు ఆధ్యాతో కలిసి రేణు దేశాయ్ స్కాట్లాండ్ వెకేషన్ వెళ్లినట్లు ఈమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

స్కాట్లాండ్ లో రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తన పిల్లలు ఎంజాయ్ చేస్తున్న తీరు పిల్లల మధ్య గొడవలకి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. స్కాట్లాండ్ అందాలను చూస్తూ ఎంతో సంబరపడుతు న్నట్టు తెలుస్తుంది.ముఖ్యంగా రేణు దేశాయ్ ఇక్కడ రోడ్లను చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే స్కాట్లాండ్ రోడ్డుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది స్వర్గానికి దారా?

ఈ దారే స్వర్గంలా అనిపిస్తుందా? అంటూ స్కాట్లాండ్ రోడ్లకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ తో విడాకులు తర్వాత ఈమె వెండితెరకు దూరమైంది. అయితే తాజాగా రవితేజ నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రేణు దేశాయ్ తిరిగి తెరపై సందడి చేయనున్నారు.

ఇకపోతే తన కుమారుడు అకీరా ప్లస్ టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసింది. ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus