రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేక పరిచయం అవసరం. హీరోయిన్ గా ‘బద్రి’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఈమె ఎక్కువ ఫేమస్. 2000వ సంవత్సరం నుండి పవన్ కళ్యాణ్ తో డేటింగ్లో ఉన్న ఈమె.. తర్వాత అతనితో కలిసి ‘జానీ’ లో హీరోయిన్ గా నటించింది.అటు తర్వాత 2009లో పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. కానీ ఊహించని విధంగా 2012లో విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయింది.
ఇదిలా ఉండగా.. రేణు దేశాయ్ కెరీర్ ను ప్రారంభించింది పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాతోనే అని అంతా అనుకుంటారు.కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే రేణు దేశాయ్ కి ఓ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. కానీ చివరి నిమిషంలో తప్పించారని తెలుస్తుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అవును.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డెబ్యూ ఇచ్చిన సినిమా ‘నిన్ను చూడాలని’.
వి.ఆర్.ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘నిన్ను చూడాలని’ హీరోయిన్ గా మొదట రేణు దేశాయ్ కి లుక్ టెస్ట్ చేశారట.ఆ టైంలో రేణు దేశాయ్ ఓ మోడల్ గా ఉన్నారు. కానీ ఆమెకు తెలుగు రాదు. లుక్స్ పరంగా ఓకే అనుకున్నా… లిప్ సింక్, డైలాగ్ మాడ్యులేషన్ వంటివి పర్ఫెక్ట్ లేవు అని భావించి ఆమెను ఆ సినిమా నుండి తప్పించారట. ఒకవేళ ఆ సినిమాలో కనుక రేణు దేశాయ్ ఫైనల్ అయితే.. అది ఆమెకు డెబ్యూ మూవీ అయ్యేది.
కానీ ‘నిన్ను చూడాలని’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కాబట్టి ‘బద్రి’ తో ఆమెకు మంచి డెబ్యూ లభించింది అని చెప్పాలి.