రేణు దేశాయ్ అప్పుడు టాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుంటారు. అలా ఇచ్చినప్పుడు చాలా విషయాల గురించి ప్రస్తావిస్తారు. అవి కొన్ని నెలల పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అవి నార్మల్‌గా వచ్చేలోపు మరోసారి ఆమె ఇంటర్వ్యూ ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు అలాగే కొత్త ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. అందులో ఆమె ఎప్పటిలాగే వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. అందులో కొన్ని విషయాలు మీ కోసం..
కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రేణూ దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత మొన్నీమధ్య ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా నటించిన ఆ సినిమాలో రేణు దేశాయ్‌కి మంచి పాత్రే వచ్చినా.. ఆ సినిమా ఫలితం బాగోలేకపోవడంతో ఆ పాత్ర ఎలివేట్ అవ్వలేదు. అయితే, ఆ సినిమా సమయంలో తనపై కొన్ని విమర్శలు వచ్చాయని చెప్పారు. కమ్‌బ్యాక్ ఇచ్చింది.. ఇక ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తుందని కొంతమంది రాశారని కానీ తాను రాలేదని చెప్పారు.
ఆ సినిమా తర్వాత ఇప్పటివరకూ మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదని, కనీసం ఏ సినిమాకు సైన్ కూడా చేయలేదని రేణు తెలిపారు. నా గురించి అలా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పరు కదా. మాట్లాడేవారు ఎలాగైనా, ఏమైనా మాట్లాడతారు. అందుకే వాళ్లు అలానే ఉంటారు. 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఒకవేళ నేను అప్పటినుంచి ఇప్పటి వరకూ సినిమాలు చేస్తూ ఉన్నట్లైతే ఇప్పటికి చాలా మంచి పేరు వచ్చేది అని రేణు అన్నారు.
ఇక ఇప్పుడు గొప్ప పాత్రలు వస్తున్నాయని.. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు కూడా వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఓ అత్త పాత్రకు ఓకే చెప్పినట్లు తెలిపారు. త్వరలోనే ఆ సినిమా ప్రారంభమవుతు్ందని.. అత్తాకోడళ్లకు కామెడీ డ్రామాగా ఆ సినిమా అలరిస్తుందని తెలిపారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానమిస్తూ… భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం అన్నారు.