ప్రముఖ నటి రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతుంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన ఆమె ప్రేమ, మోసం, ఆత్మహత్య ఇలా చాలా విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ప్రేమ ఎంతో మధురమైందని.. అలాంటి ప్రేమలో ఫెయిల్ అయితే, ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమని అన్నారు. అయితే ప్రేమే జీవితం కాదని.. అది లేనిదే బతుకు లేదనే భావనను మనసులోకి రానివ్వద్దని అన్నారు.
ప్రేమ ఫెయిల్ అయినప్పుడు దాని నుండి బయటపడడానికి ఆత్మహత్య పరిష్కారం కాదని తేల్చిచెప్పారు. అలాంటి ఆలోచనలు చేయొద్దని సూచించారు. ప్రతి ఒక్కరికి వారి జీవితం, ప్రాణం ఎంతో విలువైనవని.. వీటి కంటే ఏవీ కూడా మనిషికి ఎక్కువ కాదని రేణు అన్నారు. ప్రేమలో ఓడిపోతే ఎంత బాధ కలుగుతుందో తనకు బాగా తెలుసునని.. ప్రేమించే వ్యక్తి మనతో పాటు లేడని, మనల్ని మోసం చేశాడనే ఆలోచనలు మనసుకి చాలా కష్టం కలిగిస్తాయని అన్నారు. ఆ బాధ నుండి బయటపడడం కష్టమేమీ కాదని అన్నారు.
మనసుని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలని.. వీలైతే కౌన్సిలింగ్ తీసుకోవడంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహాయంతో మునుపటి జీవితానని ప్రారంభించవచ్చని చెప్పుకొచ్చారు. ఇక తన జీవితం గురించి మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకేలా జీవించాలనేది తన ఆలోచన అని చెప్పారు. బాధ వచ్చినప్పుడు కుంగిపోవడం, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం వంటివి తన జీవితంలో ఉండకూడదని భావిస్తున్నట్లు చెప్పారు.