Renu Desai: పవన్ గురించి మాట్లాడిన ప్రతిసారి నిజాలే మాట్లాడాను!

  • August 18, 2023 / 01:14 PM IST

సినీనటిగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ అందరికీ ఎంతో సుపరిచితమే.పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈమె ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. అయితే ఈమెను మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు పలు సందర్భాలలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ పెద్ద యుద్ధమే చేస్తూ ఉంటారు.

గతంలో పవన్ కళ్యాణ్ తనకు చేసినటువంటి మోసం విడాకుల గురించి మాట్లాడిన సమయంలో పవన్ ఫ్యాన్స్ ఈమె పట్ల భారీగా ట్రోల్ చేశారు. పవన్ గురించి ఇలా మాట్లాడమని కొందరు డబ్బు ఇచ్చి మరి తనతో మాట్లాడిస్తున్నారు అంటూ ఆరోపణలు కూడా చేశారు. అయితే తాజాగా ఒక సామాన్య పౌరురాలుగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ఈమె చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది.
ఇప్పుడు ఈ వీడియో పై పవన్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేసిన, పవన్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈమెను ట్రోల్ చేస్తున్నారు.

ఈ వీడియో గురించి ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందుకే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ తన్ని తరిమేసింది అంటూ కామెంట్ చేశారు.ఈ కామెంట్ పై స్పందించిన రేణు దేశాయ్ ఇప్పుడు మీకు సంతృప్తిగా ఉందా లేకపోతే నన్ను తిట్టండి మీతో తిట్లు తినడానికే నా జీవితం ఉన్నది అంటూ కూల్ గా రిప్లై ఇచ్చారు.

ఇలా ఈ పోస్ట్ చేసినటువంటి (Renu Desai) రేణు దేశాయ్ గతంలో పవన్ కళ్యాణ్ విడాకుల గురించి మాట్లాడిన ఇప్పుడు ఆయనకు మద్దతు తెలుపుతూ మాట్లాడిన తాను మాట్లాడిన మాటలన్నీ కూడా నిజాలేనని తెలిపారు.. అయితే పవన్ గురించి నిజాలు మాట్లాడిన ప్రతిసారి ఆయన అభిమానులు అలాగే యాంటీ ఫ్యాన్స్ తనని తిడుతూనే ఉన్నారు అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus