‘ఊర్వశివో రాక్షసివో’కి రీషూట్లు.. నిజమేనా?

‘ప్రేమ కాదంట’ అంటూ చాలా రోజుల క్రితం అంతా ఓకే అయ్యి.. రిలీజ్‌ అనుకున్నప్పుడు ఆగిపోయింది ఓ సినిమా. ఆతర్వాత ఇక ఆ సినిమా రాదేమో అని అనుకుంటుండగా.. ‘ఊర్వశివో రాక్షసివో’ అంటూ కొత్త పేరుతో రావడానికి సిద్ధమైంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా పేరులాగే రిలీజ్‌ విషయంలోనూ ట్విస్ట్‌ ఉందంటున్నారు టాలీవుడ్‌ జనాలు. టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెరుగుతాయి..

ఈ మాట ఎవరైనా కాదన్నారు అంటే వాళ్లు ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్‌ చూడకపోయుంటారు అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో టీజర్‌తో హైప్‌ పెంచిన సినిమాల్లో అదొకటి. అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రమిది. ఈ సినిమాను నవంబరు 4న విడుదల చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, మరోవైపు సినిమా షూటింగ్స్‌ జరుగుతున్నాయని టాక్‌. అదేంటి అప్పుడెప్పుడో సినిమా పూర్తయిపోయింది కదా..మళ్లీ షూటింగ్‌లు ఏంటి? కొంపదీసి రీషూట్‌లా అనుకుంటున్నారా?

ఈ మాటకు సినిమా సన్నిహిత బృందం అయితే అవును అనే సమాధానమే ఇస్తోంది. ఇటీవల సినిమాను చూసిన అల్లు అరవింద్‌ కొన్ని మార్పులు సూచించారట. దీంతో సినిమాకు రిపేర్లు చేస్తున్నారని సమాచారం. అల్లు శిరీష్ నుండి ‘ఎబిసిడి’ సినిమా తర్వాత మరో సినిమా రాలేదు. మే 2019లో ఆ సినిమా విడుదలైంది. అంటే మూడేళ్లుగా సినిమా లేదు. ఇప్పుడు ‘ఊర్వశివో రాక్షసివో’ రెడీ అయ్యింది. జీఏ 2 పిక్చర్స్ ఈ సినిమా మీద శిరీష్‌ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు అంటున్నారు.

రీషూట్‌లో క్లైమాక్స్ ఎపిసోడ్‌తోపాటు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్‌లో మార్పులు చేస్తున్నారట. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కొత్తగా ఆఫీసులో చేరిన శ్రీ (అల్లు సిరీస్)కి సింధు (అను ఇమ్మాన్యుయేల్) పరిచయమవుతుంది. లిఫ్టులో అనుకోకుండా ముద్దుతో మొదలైన వీరి ప్రయాణం, ఆ తర్వాత ముదిరిపోతుంది. ఈ బంధాన్ని శ్రీ ప్రేమ అనుకుంటే, సిందు కాదంటుంది. ఆ తర్వాత ఏమైంది, శ్రీ ప్రేమ గెలిచిందా లేదా అనేదే కథ.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus