లాక్ డౌన్ సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకొంతకాలం థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ తెరిచినా ఎంతమంది థియేటర్లకు వస్తారో తెలియదు. ఈ క్రమంలో ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరిగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్టార్లు కూడా వెండితెరకు ప్రత్యామ్నాయం ఓటీటీ అని నమ్ముతున్నారు. అందుకే వెబ్ సిరీస్, వెబ్ సినిమాలతో హంగామా చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పటివరకు రెండు వెబ్ సిరీస్ లలో నటించింది.
‘ఆహా’లో విడుదలైన ‘లెవెన్త్ అవర్’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె నటించిన ‘నవంబర్ స్టోరీ’ అనే సిరీస్ హాట్ స్టార్ లో విడుదలైంది. సినిమాకి పెట్టే రేంజ్ లో ఈ సిరీస్ కు బడ్జెట్ పెట్టినా. అవుట్ ఫుట్ మాత్రం అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయారు దర్శకుడు. నిజానికి ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సిరీస్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని భావించారు. మంచి కాన్సెప్ట్ ను ఎన్నుకున్నప్పటికీ.. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
కనీసం వెబ్ మూవీగా తీసి ఉంటే కాస్త గ్రిప్పింగ్ గా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ లో సరైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవని కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా రేంజ్ కి తగ్గట్లుగా సిరీస్ లేదని.. ఆమె స్టార్ డం ని సరిగ్గా వాడులేకపోతున్నారని నెటిజన్ల వాదన. మొత్తానికి ఓటీటీలో తమన్నా నటించిన రెండు సిరీస్ కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి!