Geetu,Revanth: రేవంత్ కి స్మూత్ గా క్లాస్ పీకిన గీతు..! అసలేం జరిగిందంటే..?

బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు జరుగుతున్నాయి. నిజానికి గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ మద్యలో హగ్గులు , కిస్సులు తక్కువనే చెప్పాలి. నిన్నటిదాకా ఆరోహి, సూర్య ఇద్దరూ ఫ్రెండ్స్ హౌస్ లో హగ్గులు ఇచ్చుకున్నారు. ఇక ఆరోహి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, సూర్య – ఇనయల మద్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోంది. మరోవైపు అర్జున్ కళ్యాణ్ శక్తివంచన లేకుండా శ్రీసత్య కోసం కష్టపడిపోతున్నాడు. ఈ మేటర్ ఇలా ఉంటే., రేవంత్ కి స్మూత్ గా క్లాస్ పీకింది గీతు.

ఆడవాళ్లు కంఫోర్ట్ ఉన్నారో లేరో చూసుకోమని, లేదంటే బ్యాడ్ అయిపోతావని చెప్పింది. దీనికి ఉదాహరణగా, నువ్వు నా బుగ్గమీద ముద్దు పెట్టావ్ కదా అది నాకు కంఫోర్ట్ గా లేదు అంటూ చెప్పింది. రేవంత్ ఆనందంగా ఉన్నప్పుడు గీతు బుగ్గ మీద ముద్దుపెట్టాడు. అది జస్ట్ క్యాజువల్ గానే అయినా కూడా గీతు దీనిపైన చర్చ పెట్టింది. ఇది ఆదిరెడ్డితో డిస్కస్ చేసింది. నాకు అన్ కంఫోర్ట్ గా ఉందని, రేవంత్ కి చెప్పాలని, ఫీల్ అవ్వకుండా చెప్పాలని అభిప్రాయపడింది. ఇక మార్నింగ్ కాఫీ తాగేటపుడు ఆదిరెడ్డి సమక్షంలోనే రేవంత్ కి స్మూత్ గా క్లాస్ పీకింది.

ఆడపిల్లలు అన్నిసార్లు కంఫోర్ట్ గా ఉండరని జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పింది. అంతేకాదు, ఫైమా ఒళ్లో పడుకున్నావ్ కదా, అది కూడా అడిగి చేయాలని, కొన్ని సందర్భాల్లో వాళ్లు అన్ ఈజీగా ఫీల్ అవుతారని చెప్పింది. దీంతో రేవంత్ అప్పటికప్పుడు ఫైమాని పిిలిచి సారీ చెప్పాడు. దీనికి ఫైమా నేనేం ఫీల్ అవ్వలేదంటూ సమాధానం చెప్పింది. ఏది ఏమైనా రేవంత్ ని రివ్యూవర్స్ అయిన ఆదిరెడ్డి, ఇంకా గీతు ఇద్దరూ కూడా సరిచేస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో మాట తూలుతున్న రేవంత్ ని ఆదిరెడ్డి సెట్ చేస్తుంటే, ఇలాంటి విషయాలు చెప్తూ గీతు రేవంత్ కి సపోర్ట్ చేస్తోంది. వీరిద్దరూ రేవంత్ కి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదో ఒక సలహా ఇస్తునే ఉన్నారు. ఇక ఈవిషయం ఇక్కడితో సద్దుమణిగిపోయింది. 5వ వారం కెప్టెన్సీ రేసులో గెలిచిన రేవంత్ ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఈవారం నామినేషన్స్ లో లేడు కాబట్టి, వచ్చే వారం కూడా సేఫ్ అయినట్లే అయ్యింది. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus