Allu Arjun, Revanth Reddy: అరెస్ట్ చేస్తామంటే కానీ.. థియేటర్ నుండి బయటకు కదల్లేదు: రేవంత్ రెడ్డి

సంధ్య థియేటర్ మేటర్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇవాళ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయమై మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు అందర్నీ షాక్ కి గురి చేసాయి. “అసలు అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు, అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు, కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు, దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.

Allu Arjun, Revanth Reddy

ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది… ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు… బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా… శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు. బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు.

అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు” అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ పెను దుమారాన్ని రేపింది. ఎందుకంటే.. అల్లు అర్జున్ స్వయంగా మాట్లాడుతూ లేడీ చనిపోయిన విషయం తర్వాత రోజు తెలిసింది అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డేమో పోలీసులు వెంటనే చెప్పారు అని వివరణ ఇచ్చారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి తన వాదనను బలోపేతం చేయడం కోసం ఇలా చెప్తున్నాడా? లేక అల్లు అర్జున్ అబద్ధం చెప్పాడా? అనేది తెలియాల్సి ఉండగా.. అల్లు అర్జున్ మీద యావత్ తెలంగాణ అధికార వర్గం కోపంగా ఉన్నదనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.

మరోపక్క అల్లు అర్జున్ కి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన 4 వారాల బెయిల్ కూడా ముగుస్తోంది, మరి అల్లు అర్జున్ & టీమ్ ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారు? బన్నీ మళ్లీ జైల్ కి వెళ్ళకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అనేది ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. సినిమా ఇండస్ట్రీ మీద ప్రభుత్వం ఈస్థాయిలో కోప్పడడం అనేది బహుశా ఇదే మొదటిసారేమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus