బిగ్ బాస్ హౌస్ లో పాము – నిచ్చెనల టాస్క్ కంప్లీట్ అయ్యింది. ఇందులో భాగంగా శ్రీసత్య, రోహిత్, వాసంతీ ఇంకా ఇనయలు అవుట్ అయ్యారు. వీళ్లకి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. రేవంత్ ని సంచాలక్ గా నియమించి వీళ్లతో స్టిక్కరింగ్ గేమ్ ఆడించాడు. ఎవరి టీషర్ట్ పై ఎక్కువ స్టిక్కర్లు ఉంటాయో వాళ్లు గేమ్ లో నుంచీ అవుట్ అయిపోతారని చెప్పాడు. అంతేకాదు, గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ లోనే ఈ గేమ్ ఆడాలి. ఈ గేమ్ లో లైన్ దాటినా కూడా అవుట్ అవుతారని రేవంత్ చెప్పాడు. దీంతో ఫస్ట్ ఇనయ, తర్వాత వాసంతీ అస్సలు గేమ్ లో పోరాడకుండానే బయటకి వచ్చేశారు.
ఆ తర్వాత నాగమణుల టాస్క్ ప్రారంభం అయ్యింది. నిచ్చెనల టీమ్, పాములు టీమ్ ఈ మణులు సంపాదించేందుకు గట్టిగా ప్రయత్నించారు. అయితే, ముందుగానే పామా టీమ్ లో ఉన్న సభ్యులు రేవంత్ ని రెచ్చగొడదాం అని ఫిక్స్ అయ్యారు. రేవంత్ ఫిజికల్ అవ్వకపోయినా, ఫిజికల్ అవుతున్నాడు, అవుతున్నాడని చెప్దాం అని దీంతో గేమ్ వదిలేసి అందరితో వాదన పెట్టుకుంటాడని, అప్పుడు మనం మణులు కొట్టేయచ్చని ప్లాన్ వేసింది ఫైమా. దీనికి పాము సభ్యులందరూ ఓకే చెప్పారు. అనుకున్నట్లుగానే రేవంత్ వీక్ పాయింట్ పైన కొట్టారు. ఫిజికల్ అవ్వకుండానే అవుతున్నావ్ అంటూ గట్టిగా అరిచారు. ఆదిరెడ్డి అయితే రేవంత్ తో బలమైన వాదనకి దిగాడు. దీంతో రేవంత్ రెచ్చిపోయాడు.
మరోవైపు కీర్తి కూడా రేవంత్ ని రెచ్చగొట్టింది. దీంతో కీర్తి చేయి నా కంట్లో తగిలిందని రేవంత్ కంప్లైట్ ఇచ్చాడు. అస్సలు ఛాన్సే లేదు కావాలంటే వీడియో చూడు అంటూ రేవంత్ కి క్లారిటీ ఇచ్చింది కీర్తి. రేవంత్ కంప్లైట్ ఇస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాదు, ఇలా ఫిజికల్ అవ్వొద్దు అవ్వొద్దు అన్నప్పుడే రేవంత్ కీర్తిని గుద్దేందుకు ప్రయత్నించాడు. ఇక్కడే కీర్తి షటప్ అంటూ అబ్జక్ట్ చేసింది. గుద్దుతున్నావ్ అంటూ క్లియర్ గా చెప్పింది. దీంతో రేవంత్ గుద్దలేదని దబాయించాడు. ఆ తర్వాత రేవంత్ ఎవరిదైనా గోరు నాకు తగిలితే ఫిజికల్ అవుతా అంటూ రెచ్చిపోయాడు.
ఆదిరెడ్డి కూడా నువ్వు ఫిజికల్ అయినా కూడా నేను అవ్వను అంటూ రేవంత్ ని మరింత రెచ్చగొట్టాడు. నామినేషన్స్ లో వేస్కో బ్రదర్ అంటూ రేవంత్ మాట్లాడితే, నువ్వు కూడా వేస్కో నేను బయటపడను ఎన్నిసార్లు అయినా సరే వేస్కో అంటూ రెచ్చిపోయాడు ఆదిరెడ్డి. ఇలా ప్లాన్ ప్రకారమే రేవంత్ ని రెచ్చగొట్టింది పాము టీమ్. పాము నిచ్చెన టాస్క్ లో మణులు కాపాడుకోవడంలో నిచ్చెనల టీమ్ విఫలం అయ్యింది. దీంతో పాము టీమ్ గెలిచినట్లుగా సంచాలకులు చెప్పారు. ఇక రేవంత్ గార్డెన్ ఏరియాలో కూర్చుని అనవసరంగా బిగ్ బాస్ కి వచ్చానని బాధపడ్డాడు.
అందరూ నా వీక్ నెస్ పైన దెబ్బకొడుతున్నారని, టాస్క్ సమయంలో నేను ఫిజికల్ అవ్వకుండానే అవుతున్నానని చెప్తున్నారని దానివల్ల నాకు కాళ్లు చేతులు కట్టేసినట్లుగా అయిపోయిందని బాధపడ్డాడు. అంతేకాదు, నాగార్జున గారు ఇంకోసారి ఫిజికల్ అయితే ఎల్లో కార్డ్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని ఎమోషనల్ అయ్యాడు. ఒక్కడే ఏడ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి రాకుండా ఉండాల్సిందని బాధపడ్డాడు.
నిజానికి రేవంత్ ఇలా మాట్లాడటం అనేది ఇది మొదటిసారి కాదు. గీతు టార్చర్ పెట్టినపుడు ఒకసారి ఇలాగే అన్నాడు. వీళ్లు ఉన్న సీజన్ లోకి అనవసరంగా వచ్చానని, వేరేవాళ్లు చాలామంది గీతు ఎంతకైనా తెగిస్తుందని చెప్పారని అయినా కూడా వినలేదని అన్నాడు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ కి వచ్చి తప్పుచేశాననే బాధపడ్డాడు రేవంత్. మొత్తానికి రేవంత్ బాధలో అర్ధం ఉందని, కావాలనే పాము టీమ్ రేవంత్ ని రెచ్చగొట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.