బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి తెరకెక్కించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ చిత్రాన్ని చాలా శాతం క్రిష్ డైరెక్ట్ చేసారు. మిగిలిన భాగాన్ని కంగనా పూర్తి చేసింది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ‘సదాశివ్’ పాత్ర పోషించాడు. 45 రోజుల షూటింగ్ తర్వాత ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పించారట. ఇంటర్వెల్ తర్వాత సోనూ పాత్ర చంపేయాలని కంగనా కోరడం, దర్శకుడు క్రిష్ కూడా ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో సోనూసూద్ కూడా ఈ సినిమాలో నటించనంటూ తప్పుకున్నాడట.
ఆ తరువాత సోనూసూద్ పాత్రని మహ్మద్ జీషన్ అయుద్ చేసాడు. ఇదిలా ఉంటే… చరిత్రని కంగనా పూర్తిగా మార్చేసిందని, బంగారం లాంటి సినిమాని కంగనా వెండిలా మార్చిందని క్రిష్ ఇటీవల మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. కంగనా కథలో తనకు ఇష్టం వచ్చిన మార్పులు చేసిందని… కూడా క్రిష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. సోనూసూద్ పాత్రని తగ్గించాలని కంగనా అనడంతోనే సోనూసూద్ మణికర్ణిక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సోనూసూద్ పాత్రకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుస్తీ పోటీలో ఓ వ్యక్తిని… పట్టుపడుతూ తన సిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు సోనూసూద్. ఈ సన్నివేశం సినిమాలో ఉండుంటే… మరింత రక్తి కట్టేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హీరోలను మించి గ్లామర్.. పర్సనాలిటీ ఉండే సోనూసూద్ ఉంటే… ఆ చిత్రానికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది.. అలాంటిది ఈ సీన్ ఎలా తీసేశారంటూ.. కొందరు కామెంట్లు పెడుతున్నారు.
View this post on InstagramWe just got our hands on a video of @sonu_sood from Manikarnika. Reportedly, this is the scene Kangana Ranaut wanted Krish, the director, to remove from the film. Eventually, Sonu was told this scene wouldn’t make it to the final cut which lead to the actor exiting the period drama. . . . . #SonuSood #Manikarnika #PeriodDrama #Bollywood #bollywoodmovie #KanganaRanaut
A post shared by MissMalini Bollywood (@missmalinibollywood) on