RGV, Ariyana: బోల్డ్‌ వీడియోతో వర్మ- ఆరియానా ప్రచార కక్కుర్తి!

రామ్‌ గోపాల్‌ వర్మకు ఎంత ప్రచార కక్కుర్తి ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆయన ప్రమోషన్‌ కోసం చేసే ప్రతి వీడియోను, ట్వీట్‌ను, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో వర్మ ప్రచారం కోసం చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్‌ కావడం లేదు. దీంతో వర్మ ఏకంగా బోల్డ్‌ ఇంటర్వ్యూ ప్లాన్‌ చేశారు. అది కూడా ‘బోల్డ్‌’ను ఇంటి పేరుగా పెట్టుకున్న బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఆరియానాతో. ఆ ఇంటర్వ్యూ చూశాక… వర్మ, ఆరియానా ప్రచార కక్కర్తి ఇంతగా పెరిగిపోయిందా అనిపించకమానదు.

వర్మ – ఆరియానా ఇంటర్వ్యూ అనేసరికి అప్పుడెప్పుడో జరిగిన ఇంటర్వ్యూ గుర్తొస్తుంది అందరికీ. దానిని గుర్తు చేస్తూనే ఈ ఇంటర్వ్యూ మొదలైంది. అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్య వస్తున్న పుకార్లు, వర్మ గురించి ప్రజల్లో ఉన్న పుకార్లు, అపోహల గురించి చర్చించుకున్నారు. హీరోయిన్లతో వర్మ అఫైర్ల గురించి వచ్చిన పుకార్ల గురించి కూడా చర్చ నడిచింది. అయితే పాయింట్‌ ఏదైనా ఆరియానాను పొగడటానికి ఈ ఇంటర్వ్యూ పెట్టారు అని ఈజీగా తెలిసిపోతోంది. ఊ అంటే… అందమైన ఫిగరు, అందం అంటూ ఆరియానాను వర్మ ఆకాశానికెత్తాడు.

ఈ క్రమంలో ‘బోల్డ్‌’ ప్రశ్న అంటూ ఆరియానా ఓ ప్రశ్న అడిగింది… అలా అనడం కంటే అడిగించారు అంటేనే బెటరేమో. ‘మీరు రీసెంట్‌ సెex ఎప్పుడు చేశాడు’ అని వర్మను ఆరియానా అడిగింది. దానికి వర్మ ‘నువ్వు వచ్చిన దానికి గంట ముందు’ అని చెప్పాడు. అక్కడితో ఆగకుండా ‘నీతో కూడా సెex చేశా…’ అంటూ బాంబు పేల్చాడు. అయితే ‘అది మనసులో..’ అంటూ తోక అంటించాడు. ఆమె అందాలను చూసి… మైమరిచిపోయి మనసులో చేశాడట వర్మ. ఇటీవల కాలంలో సరైన సినిమాలు చేయని వర్మ… ఇలాంటి బూతు ఇంటర్వ్యూ చేశాడో ఊహించేయొచ్చు. అయితే ఆరియానా ఎప్పుడూ అటెన్షన్‌ సీకర్‌ అనే విషయం తెలిసిందే. ఇద్దరు ఘనులు కలసి ఓ ఘనమైన వీడియో చేశారు. అదన్నమాట సంగతి.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus