మళ్ళీ జనాల్ని గొర్రెల్ని చేసిన అర్జీవి..!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని మొదలు పెట్టి.. విడుదల చేసే వరకు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులకి నిద్ర లేకుండా చేసేసాడు వర్మ. టీడీపీ నేతలను పరుగులు పెట్టించాడు. కొన్ని థియేటర్లు మూత పడటానికి కూడా కారణమయ్యాడు. ‘ఎన్టీఆర్’ జీవితాన్ని అడ్డం పెట్టుకుని నందమూరి అలాగే నారా ఫ్యామిలీలకు మనశ్శాంతి లేకుండా చేసాడు. ఇక ఆ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకుండా చేశారనే కడుపుమంటతో అనుకుంట ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేస్తున్నాడు.

దీపావళి రోజున ట్రైలర్ కూడా విడుదల చేసేసాడు. ఈ ట్రైలర్ తో డైరెక్ట్ గానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతని కొడుకు నారా లోకేష్ పై సెటైర్లు వేసాడు. ఈ చిత్రం విడుదలవుతుందో లేదో తరువాత సంగతి కానీ… తన తదుపరి చిత్రం టైటిల్ ‘మెగా ఫ్యామిలీ’ అంటూ అర్ధరాత్రి ట్వీట్ చేసాడు వర్మ. దీంతో మళ్ళీ మెగాఫ్యామిలీ అభిమానులకి నిద్రలేకుండా చేసాడనే చెప్పాలి. ‘ఇక పూర్తి వివరాలను రేపు ప్రకటిస్తానని’ చెప్పాడు వర్మ. అయితే ఈరోజు తన ట్విట్టర్ ద్వారా వర్మ స్పందిస్తూ.. ” ‘మెగా ఫ్యామిలీ’ సినిమాని నేను తెరకెక్కించడం లేదు. ‘మెగా ఫ్యామిలీ’ అనేది 39 మంది పిల్లలు ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన చిత్రం. ఇందులో ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నారు… పిల్లల సినిమాలను చిత్రీకరించడంలో నాకు అనుభవం లేదు… అందుకే ఈ సినిమాని తెరకెక్కించకూడదని నేను నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు వర్మ.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus