తన గురువుతో ‘ఇస్మార్ట్ శంకర్’ సెలబ్రేషన్స్ లో తేలిపోతున్న పూరి

మొత్తానికి పూరి ఓ హిట్టు కొట్టాడు. ప్రేక్షకులు కేవలం ఈ చిత్రం హిట్టు అని మాత్రమే చెప్పడం లేదు.. ‘మాస్ హిట్టు కొట్టాడు పూరి’ అని చెబుతున్నారు. ఇలా మాస్ హిట్టు కొట్టాడు అని చెప్పడం పూరికి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఈమధ్య స్టార్ హీరోలే కాదు.. మీడియం హీరోలు కూడా ఈయన మొహం చూడలేదు. ఈ క్రమంలో ‘డబుల్ దిమాక్’ సబ్జెక్టు తో ‘డబుల్ ధమాకా’ అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. 4 ఏళ్ళ తరువాత దక్కిన విజయం కావడంతో.. సన్నిహితులతో పాటు తన గురువు రాంగోపాల్ వర్మను కూడా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ టీం తో ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా… ‘ఇస్మార్ట్ శంకర్’ లో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ తన ట్విట్టర్ లో ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో డైరెక్టర్ పూరీని, రాంగోపాల్ వర్మ గట్టిగా ముద్దు పెట్టుకుంటున్నాడు. ‘పూరి,ఆర్జీవీ ల మధ్య ఇంత ఘాటైన గురుశిష్యుల బంధం ఉందా’..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూరి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అప్పటి నుండి వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఈ ఫొటోలో మరోసారి కనిపించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus