పలు వివాదాస్పద అంశాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయనాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వర్మ గురువారం నాడు ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేశారు. ”ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలోనే అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది” అంటూ ఆర్జీవీ వెటకారంగా పోస్ట్ పెట్టాడు.
దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇష్యూపై కూడా ఓ సినిమా తీయండి అంటూ సలహాలు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ బంద్ నిర్వహించింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
By the way things are going A P politicians will soon have to train in boxing , karate , stick fighting etc
— Ram Gopal Varma (@RGVzoomin) October 21, 2021
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!