RGV,KGF2: కేజీఎఫ్2 సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ!

ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో కేజీఎఫ్2 సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫుల్ రన్ లో 1250 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. యశ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా ఎంతగానో నచ్చింది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అయితే ప్రముఖ దర్శకులలో ఒకరైన ఆర్జీవీ తాజాగా కేజీఎఫ్2 సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందికి కేజీఎఫ్2 సినిమా నచ్చలేదని ఆర్జీవీ అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ఒకరు నాకు ఫోన్ చేసి అరగంట సినిమా కూడా పూర్తి కాకముందే కేజీఎఫ్2 బోర్ అనిపించిందని చెప్పాడని ఆర్జీవీ వెల్లడించారు. బాలీవుడ్ వాళ్లకు కేజీఎఫ్2 నచ్చినా నచ్చకపోయినా ఆ సినిమా సాధించిన సక్సెస్ ను మాత్రం ఎవరూ కాదనలేరని ఆర్జీవీ వెల్లడించారు. 1970లలో అమితాబ్ నటించిన నటించిన సినిమాల జానర్ కు సంబంధించిన తరహా కథ కేజీఎఫ్2 అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ వాస్తవికతకు దూరంగా ఈ సినిమాను తెరకెక్కించాడని ఆర్జీవీ కామెంట్లు చేశారు. సినిమాలో పెద్దమ్మ సీన్ ను గుర్తుకు తెచ్చుకుంటే రాఖీ భాయ్ మెషీన్ గన్ తో పేలిస్తే జీపులు గాల్లోకి ఎగిరిపోతాయని ఆర్జీవీ కామెంట్లు చేశారు. ఈ విధంగా జీపులు గాల్లోకి లేవడం విడ్డూరంగా అనిపిస్తుందని ఆర్జీవీ అన్నారు. ఇలాంటి సన్నివేశాలను నేను నోరెళ్లబెట్టుకుని చూశానని ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాలలో కశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటని ఈ సినిమాలో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం ఉన్న వ్యక్తి అనుపమ్ ఖేర్ అని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిందని ఆయన అన్నారు. గడిచిన 20 సంవత్సరాలలో కశ్మీర్ ఫైల్స్ ను చూసినంత సీరియస్ గా ప్రేక్షకులు ఏ సినిమాను చూసి ఉండరని ఆయన కామెంట్లు చేశారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus