RGV: రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి వరుస విజయాలతో జోరుమీదుండగా మహేష్ రాజమౌళి కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతుండటం ఫ్యాన్స్ ను ఒకింత బాధపెడుతోంది. 2025లో మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజైతే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే బడ్జెట్ కనీసం 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే.

రాజమౌళి స్థాయిలో బడ్జెట్ విషయంలో రిస్క్ చేసే డైరెక్టర్లు చాలా తక్కువమంది ఉన్నారు. అయితే ఆర్జీవీ జక్కన్న సినిమాల బడ్జెట్ గురించి, తన సినిమాల బడ్జెట్ గురించి పోల్చి షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకు కుళ్లు లేదని ఏ దర్శకుని విషయంలో కూడా నేను కుళ్లుకోనని ఆయన చెప్పుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఓపిక ఎక్కువని ఆయన అన్నారు. నాకు మాత్రం ఆ స్థాయిలో ఓపిక అస్సలు లేదని ఆయన కామెంట్లు చేశారు.

రాజమౌళి సినిమా కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేస్తారని ఆయన స్థాయిలో సినిమా కోసం ఖర్చు చేయడం నా వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. నాకు ఏ నిర్మాత అయినా 500 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే నేను మాత్రం కేవలం 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో మాత్రమే తెరకెక్కిస్తానని ఆయన కామెంట్లు చేశారు. నా స్టైల్ ఇదేనని నా స్టైల్ ను అస్సలు మార్చుకోనని ఆర్జీవీ పేర్కొన్నారు.

ఆర్జీవీ (RGV) ఇప్పుడు చెత్త సినిమాలు చేస్తున్నా ఒకప్పుడు మాత్రం అద్భుతమైన సినిమాలను తెరకెక్కించడం వల్ల ఆయనను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన వ్యూహం మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. ఆర్జీవీ ఈ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus