మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు. సినిమా రిలీజయ్యాక రిజల్ట్ బట్టి సైలెంట్ అయిపోతుంటాడు కానీ.. సినిమా రిలీజ్ ముందు వరకూ మాత్రం ఆర్జీవీ చేసి హడావుడికి అంతు ఉండదు. “భైరవగీత” విషయంలో కూడా అదే తరహాలో ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లో నానా హల్ చల్ చేసిన వర్మ.. “2.0” రిజల్ట్ కాస్త ముందుగా తెలిసేసరికి సైలెంట్ అయిపోయాడని టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయిపోయాక ఉన్నట్లుండి సినిమాను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7కి పోస్ట్ పోన్ చేయడం అనేది వర్మ వ్యూహాత్మక చర్య మాత్రమేనని.. వర్మ పేర్కొన్న సో కాల్డ్ ఇష్యూస్ కాదని తెలుస్తోంది.
కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన “భైరవగీత” ఓ రియలిస్టిక్ లవ్ స్టోరీ.. కుల హత్యల నేపధ్యంలో సాగే ప్రేమ కథ. ఈ సినిమాపై ప్రేక్షకులకు పెద్దగా అంచనాల్లేవు కానీ.. ఫస్ట్ డే టాక్ బాగుండి, రివ్యూస్ బాగా వస్తే మాత్రం తప్పకుండా చూస్తారు. మరి వర్మ ఆ పాజిటివిటీని “భైరవగీత” చిత్రానికి తీసుకురాగలడో లేదో చూడాలి.