మేము ‘ఎన్టీఆర్ బయోపిక్’ తీస్తున్నాం అని నందమూరి బాలకృష్ణ – క్రిష్ లు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాలతో ఎంత హడావిడి చేసినా ఉపయోగం లేకపోయింది. ఈ రెండు పార్టుల లోనూ వాస్తవం లేక పోగా భజన ఎక్కువయిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఓ మహానటుడు బయోపిక్ ను సొంత ఫ్యామిలీ వారు తీస్తే ఇలాగే ఉంటుందీ అని ఈ చిత్రంతో నిజమైందని ఫిలిం విశ్లేషకులు చెప్పుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఎన్టీఆర్ అసలు సిసలైన బయోపిక్ ను నేను తీస్తున్నాను అంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తో రాంగోపాల్ వర్మ ముందుకు వచ్చాడు.
లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత ఏం జరిగింది అనేదే మెయిన్ పాయింట్ గా తీసుకుని వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఒక రకంగా చూస్తే.. ఇది ‘ఎన్టీఆర్ బయోపిక్’ మూడో పార్ట్ అనుకోవాలి. ఇక రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు ‘కేర్ ఆఫ్ అడ్రెస్స్’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కూడా జనాలను రెచ్చగొట్టే అంశాలను చేర్చే ఉంటాడని ఇప్పటికే జనం ఫిక్స్ అయిపోయారు.. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ఎంతవరకూ అంగీకరిస్తారు అనేది పెద్ద ప్రశ్న..? ఎందుకంటే ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు పై విపరీత మైన సెటైర్లు ఉన్నాయి, అయన పాత్రని చాలా నెగెటివ్ గా చూపించినట్టు ట్రైలర్ చెబుతుంది. ఇప్పుడు ఇవన్నీ.. సినిమా విడుదలకు అడ్డంకులుగా మారే అవకాశం లేకపోలేదు. ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవరైనా సరే ఈ చిత్రాన్ని విడుదలను అడ్డుకునే అవకాశాలున్నాయి. ఎవరూ ఇప్పటివరకూ మాట్లాడకపోయినా… సెన్సార్ బోర్డు వారు అడ్డంకులు చెప్పే అవకాశం ఉంది. మరి చివరికి ఏమవుతుందో చూడాలి. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మొదట మార్చి 15 న విడుదల చేయాలనుకున్నప్పటికీ… ఇప్పుడు మార్చి 22 కు మార్చరట.