‘లోకేష్ మీద ఒట్టు’ అంటున్న చంద్రబాబు..!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఇప్పటికే జనాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మొదటి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో లేని నిజాలు ఈ చిత్రంలో చూపిస్తానని రాంగోపాల్ వర్మ ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఈ చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ ని విడుదల చేసాడు.

‘వాడూ నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు’ అంటూ చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ… ఎన్టీఆర్ చెబుతున్నట్టు ఈ ట్రైలర్ ని మొదలు పెట్టాడు వర్మ. ఎన్టీఆర్ చివరి రోజుల్లోని కీలక ఘట్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు ఈ ట్రైలర్లో మరింత స్పష్టమవుతుంది. ఎన్టీఆర్ అల్లుడైన చంద్రబాబు నాయుడు.. ఆయన్ని దించేసి ఎలా ముఖ్యమంత్రి అయ్యారనే… వెన్నుపోటు సన్నివేశాలు ఈ ట్రైలర్ లో మరింత ఎక్కువగా చూపించాడు వర్మ. ‘నా కొడుకు లోకేష్ మీద ఒట్టేసి చెబుతున్నాను’ అని చంద్రబాబు చెప్పే డైలాగ్ కచ్చితంగా వైరల్ అవుతుంది అనడంలో సందేహం లేదు. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నీచంగా చూస్తూ బూతులు తిట్టే సన్నివేశాలతో పాటూ తెలుగుదేశం పార్టీలో లక్ష్మీ పార్వతి హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుందని పార్టీ నేతలు అసంతృప్తి చెందే సన్నివేశాలు కూడా ఈ ట్రైలర్లో ఉన్నాయి. ఎక్కువగా ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రలకి మిమిక్రి చేయించడమే కొంచెం కామెడీగా అనిపిస్తాయి తప్ప ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇక ‘జీవీ ఫిలిమ్స్’ బ్యానర్ పై రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదల కాబోతుంది. కీరవాణి సహోదరుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus