ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ సమాధానానికి షాక్ అయిన నెటిజన్లు

ఈమధ్య జీవితం మొత్తం ఆన్లైన్ అయిపోయేసరికి. ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం ఆన్లైన్ లోనే జరుగుతోంది. స్టార్ హీరోయిన్లు ఎక్కువగా తమ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఇన్స్టాగ్రామ్ ను వాడుతున్నారు. అందులో “ఆస్క్ మీ” సెషన్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చాలా సరదాగా సమాధానాలు చెబుతూ వాళ్ళని అలరిస్తుంటారు. “గురు” ఫేమ్ రీతికా సింగ్ కూడా ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆస్క్ మీ సెషన్ పెట్టింది.

కొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ కి అంతే రెగ్యులర్ గా సమాధానాలు చెప్పిన రీతికా.. ఒక అభిమాని “మీరు షాలిని పాండేతో డేటింగ్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా “అవును మేము డేటింగ్ చేస్తున్నాము, వచ్చే ఏడాది ఇటలీలో మా పెళ్లి అందరూ తప్పకుండా రండి” అని సమాధానం ఇచ్చింది. ఆ ఆన్సర్ ఊహించని విధంగా వైరల్ అయ్యింది. రీతికా, షాలిని పాండేలకు మేనేజర్ ఒకే కావడంతో వాళ్ళు స్నేహితుల్లా కలిసి తిరిగేవారు. ఇద్దరూ కలిసి జిమ్ చేయడం, ఆ సెషన్స్ ఫోటోస్ & వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం రెగ్యులర్ గా జరిగేది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు రీతికా ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus