ప్రచారంలో ఉన్న 2 .o కథ

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమర్షియల్ డైరక్టర్ శంకర్ కలయికలో వచ్చిన రోబో సంచలన విజయం సాధించింది. మళ్లీ అదే కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ 2 .o. ఇందులో ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రీసెంట్ గా విడుదలయిన టీజర్ అనేక రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. తాజాగా ఈ మూవీ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దాని ప్రకారం..

ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడం, ఎక్కడపడితే అక్కడ సెల్ టవర్లు నిర్మించడం, ఈ రేడియేషన్ వల్ల తమ సంతతిని తగ్గించేస్తున్న మానవజాతిపై పగతీర్చుకోడానికి పక్షులన్నీ ఒకటవుతాయి. పక్షిరాజు అక్షయ్ నాయకత్వంలో పోరాటానికి దిగుతాయి. ఈ అనర్థాన్ని అరికట్టడానికి హీరో రజనీకాంత్ తాను నాశనం చేసిన చిట్టిని తిరిగి బయటకి తీసుకొస్తాడు. దానికి కొత్త శక్తులు ఇచ్చి పక్షిరాజుతో యుద్ధం చేయిస్తాడు. మానవులపై పక్షులది పైచేయిగా మిగులుతుందా? పక్షిజాతిని రోబో సాయంతో మానవులు కట్టడిచేస్తారా? అనేది క్లైమాక్స్. తన సినిమాల్లో మెసేజ్ ని అందించడం శంకర్ కి అలవాటు. ఇందులోనూ పక్షులను కాపాడాలని సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కథ ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus