మ్యూజిక్ షోకి జడ్జ్‌గా రమ్యకృష్ణ…

ఏడెనిమిదేళ్ళుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’. జడ్జ్‌గా సీనియర్ హీరోయిన్ రోజా ఆ షోకి స్పెషల్ ఎట్ర్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అది ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే షో. దానికి పోటీగా జీ తెలుగు ఛానల్ ‘అదిరింది’ షో స్టార్ట్ చేసింది. ఈటీవీ ‘పాడుతా తీయగా’ షోకి పోటీగా జీ తెలుగు ఛానల్‌లో ‘స రే గ మ ప’ షో చేస్తోంది. దానికి జడ్జ్‌గా రమ్యకృష్ణను తీసుకొచ్చారు. రోజాకి పోటీగా రమ్యకృష్ణను తీసుకొచ్చారని టీవీ సర్కిల్ గుసగుస.

టీవీ ప్రొగ్రామ్‌కి రమ్యకృష్ణ హోస్ట్, జడ్జ్‌గా చెయ్యడం రమ్యకృష్ణకు అలవాటే. తమిళంలో విజయ్ టీవీలో డాన్స్ రియాలిటీ షో ‘జోడీ నంబర్ వన్’కి జడ్జ్‌గా, సన్ టీవీలో ‘తంగ వెట్టై’కి హోస్ట్‌గా రమ్యకృష్ణ చేశారు. తెలుగులో ‘బిగ్ బాస్ తెలుగు 3’లో ఒక ఎపిసోడ్‌కి నాగార్జున రావడం కుదరకపోతే గెస్ట్ హోస్ట్‌గా చేశారు. ఫుల్ ఫ్లెజ్డ్‌గా తెలుగు షోకి చేస్తుండటం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. ఎప్పుడో పదేళ్ళ క్రితం ‘బంగారం మీ కోసం’ అని ఒక షోకి హోస్ట్‌గా చేశారు.

ఆల్రెడీ రిలీజైన ‘స రే గ మ ప’ ప్రోమోలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు మీద రమ్యకృష్ణ కామెడీ పంచ్ డైలాగులు వేశారు. దీంతో జీ ఛానల్ షోకి గ్లామర్ యాడ్ అయ్యిందని చెప్పుకోవాలి. ఈటీవీకి రోజా ఎలా ప్లస్ అయ్యారో, జీ తెలుగుకి రమ్యకృష్ణ అలా ప్లస్ అవుతారని ఆశిద్దాం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus