Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

టాలీవుడ్ లో వారసత్వం ఉన్నా, నిలదొక్కుకోవడానికి సరైన బ్యానర్స్ పడాలి. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ కు అలాంటి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. యువ హీరోల కెరీర్ ను మలుపు తిప్పే రెండు భారీ నిర్మాణ సంస్థలు ఇప్పుడు రోషన్ మీద దృష్టి పెట్టాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ లాంటి బడా బ్యానర్లు వరుసగా రోషన్ తో సినిమాలు చేయడానికి రెడీ అవ్వడం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్.

Roshan

నిజానికి రోషన్ కు ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం రీసెంట్ గా వచ్చిన ‘ఛాంపియన్’ సినిమా అనే చెప్పాలి. ఇందులో రోషన్ లుక్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. స్వయంగా రామ్ చరణ్ “ఒక యూరోపియన్ యాక్షన్ స్టార్ లా ఉన్నాడు” అని కితాబిచ్చారంటే రోషన్ కటౌట్ లో ఎంత విషయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ లుక్ లో ఉన్న ఇంటర్నేషనల్ అప్పీల్ వల్లే ఇప్పుడు పెద్ద నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ముఖ్యంగా సితార అధినేత నాగవంశీ టేస్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తారు. రోషన్ తో ఆయన ప్లాన్ చేస్తున్న సినిమా కూడా అలాగే ఉండబోతోందని టాక్. నాగవంశీ జడ్జిమెంట్ గనుక క్లిక్ అయితే, రోషన్ ఇమేజ్ క్లాస్ నుంచి మాస్ వైపు టర్న్ అవ్వడం ఖాయం. ఆ బ్యానర్ నుంచి వచ్చే కంటెంట్ మీద యూత్ లో విపరీతమైన నమ్మకం ఉంది.

మరోవైపు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా రోషన్ లోని స్పార్క్ ని గమనించారు. ఆయన గీతా ఆర్ట్స్ లో సినిమా అనౌన్స్ చేశారంటే, రోషన్ లో గ్లోబల్ రేంజ్ నటుడు అయ్యే లక్షణాలు చూసే ఉంటారు. అరవింద్ లాంటి విజనరీ ప్రొడ్యూసర్ చేతిలో పడితే హీరోల మార్కెట్ రేంజ్ ఎలా పెరుగుతుందో మనకు తెలిసిందే. ఇప్పుడు రోషన్ కు కావాల్సింది కూడా ఇదే. ఒక నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదు. తండ్రి శ్రీకాంత్ సపోర్ట్ ఉన్నా, ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు హిట్ అయితేనే రోషన్ స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్తారు. కేవలం లుక్స్ మాత్రమే కాదు, బాక్సాఫీస్ కొల్లగొట్టే సత్తా కూడా ఉందని నిరూపించుకోవడానికి 2026 రోషన్ కు సరైన సమయం కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus