Roar Of RRR: 24గంటల్లో నెంబర్ వన్ రికార్డు!

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలు కూడా ఏ రేంజ్ లో ఉన్నాయో మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. రోర్ ఆఫ్ RRR గా విడుదలైన సినిమా మేకింగ్ వీడియో 24 గంటల్లో అత్యధికంగా వ్యూవ్స్ అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో లైక్స్ అందుకుంది.

గురువారం 11గంటలకు విడుదలైన మేకింగ్ వీడియో కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో అసలైన బజ్ క్రియేట్ చేసింది. ఇక 24 గంటల్లో ఆ వీడియో అత్యధికంగా 6.20మిలీయన్ వ్యూవ్స్ అందుకుంది. 452.2K లైక్స్ కూడా వచ్చాయి. ఇప్పటివరకు ఏ మేకింగ్ వీడియో కూడా ఈ రేంజ్ లో రికార్డును అందుకోలేదు. మరోసారి రాజమౌళి నెంబర్ వన్ అనిపించుకున్నాడు.

ఇక ఈ మేకింగ్ వీడియోకు వస్తున్న రెస్పాన్స్ చూసిన జక్కన్న సోషల్ మీడియాలో కూడా స్పందించారు. గత కొంతకాలంగా తాను సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నానని అయితే ఈ మేకింగ్ వీడియో కోసం దాదాపు రెండు నెలలు కష్టపడింది వీరే అంటూ అంటూ వారందరి గురించి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి కరోనా పరిస్థితులు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి.

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus