‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 11 వ రోజున కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. నిన్నటితో ఈ మూవీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి2’ పేరుతో ఉన్న రికార్డులను అన్నిటినీ ఈ మూవీ దాదాపు తిరగరాసింది అనే చెప్పాలి.తెలుగు వెర్షన్ వరకు ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. అందులో డౌటే లేదు. నైజాం లో రూ.100 కోట్లు షేర్ కు దగ్గరగా ఉంది ఈ మూవీ.
ఆ ఫీట్ ను సాధించి చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. మిగిలిన వెర్షన్ల విషయంలో ‘బాహుబలి'(సిరీస్) కలెక్షన్లను అధిగమిస్తుందా లేదా? అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్.
ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 11 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
99.18 cr
సీడెడ్
45.45 cr
ఉత్తరాంధ్ర
28.90 cr
ఈస్ట్
14.14 cr
వెస్ట్
11.66 cr
గుంటూరు
16.55 cr
కృష్ణా
13.15 cr
నెల్లూరు
08.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
237.17 cr
తమిళనాడు
34.22 cr
కేరళ
09.38 cr
కర్ణాటక
37.60 cr
హిందీ
94.29 cr
ఓవర్సీస్
86.78 cr
రెస్ట్
07.30 cr
టోటల్ వరల్డ్ వైడ్
506.74 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.506.74 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.917 కోట్లను కొల్లగొట్టింది.నిన్నటితో ఈ మూవీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను సాధించింది. తెలుగు వెర్షన్ వరకు ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
హిందీలో కూడా బ్రేక్ ఈవెన్ కు కొద్ది దూరంలో ఉంది. అయితే ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను అధిగమించడం కష్టమనే చెప్పాలి. ‘బాహుబలి2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది.