RRR Collections: రూ.1000 కోట్ల దిశగా ‘ఆర్.ఆర్.ఆర్’..!

  • April 7, 2022 / 12:33 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 13 వ రోజున కూడా మంచి వసూళ్ళను రాబట్టింది.టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ.. ఇలా డీసెంట్ కలెక్షన్లను రాబట్టడం అంటే మాములు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ ‘Non-SSR’ అనే మరో కొత్త ట్యాగ్ ను క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది.మిగిలిన వెర్షన్ల విషయంలో ‘బాహుబలి'(సిరీస్) కలెక్షన్లను అధిగమిస్తుందా లేదా? అనేది ప్రస్తుతానికి అయితే అయితే చెప్పలేము కానీ అతి త్వరలో రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 13 డేస్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 102.56 cr
సీడెడ్ 46.62 cr
ఉత్తరాంధ్ర 30.00 cr
ఈస్ట్ 14.64 cr
వెస్ట్ 11.97 cr
గుంటూరు 16.91 cr
కృష్ణా 13.47 cr
నెల్లూరు 08.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 244.59 cr
తమిళనాడు 34.97 cr
కేరళ 09.85 cr
కర్ణాటక 39.18 cr
హిందీ 99.50 cr
ఓవర్సీస్ 90.05 cr
రెస్ట్ 08.55 cr
టోటల్ వరల్డ్ వైడ్ 526.69 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)

 

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.526.69 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.949 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్.

మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది కానీ రికార్డులు క్రియేట్ చేయడం కష్టమనే చెప్పాలి. ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను అధిగమించడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. ‘బాహుబలి2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus