తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ… ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లకు ఏమాత్రం బ్రేకులు పడలేదు. వీకెండ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ వీకెండ్ తర్వాత ఎక్కువ డ్రాప్స్ లేకుండా నిలకడగా రాణించింది. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో వీకెండ్ వరకు ఆ ఫీట్ ను సాధించింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ 80 శాతం పైనే రికవరీని సాధించింది.
ఇంకో వీకెండ్ ఉగాది సెలవుతో కలిసి ఉంది కాబట్టి.. భాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 77.15 cr |
సీడెడ్ | 36.80 cr |
ఉత్తరాంధ్ర | 20.50 cr |
ఈస్ట్ | 11.20 cr |
వెస్ట్ | 09.76 cr |
గుంటూరు | 13.78 cr |
కృష్ణా | 10.73 cr |
నెల్లూరు | 06.44 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 186.36 cr |
తమిళనాడు | 25.18 cr |
కేరళ | 07.60 cr |
కర్ణాటక | 27.68 cr |
హిందీ | 65.60 cr |
ఓవర్సీస్ | 73.45 cr |
రెస్ట్ | 05.60 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 391.47 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.391.47 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.708 కోట్లను కొల్లగొట్టింది.బ్రేక్ ఈవెన్ విషయంలో సందేహపడనవసరం లేదు కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే రెండో వీకెండ్ ను ‘ఆర్.ఆర్.ఆర్’ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుంది అనే దాని పై ట్రేడ్ లో ఆసక్తి నెలకొంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?