4ఏళ్లుగా ప్రేక్షకులు తో ఆసక్తితో ఎదురుచూసిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మార్చి 25న రిలీజ్ అయ్యింది. సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్- చరణ్- రాజమౌళి కి ఉన్న క్రేజ్ ను బట్టి ఈ సినిమాని చూడడానికి ఎగబడి థియేటర్లకు వస్తున్నారు ప్రేక్షకులు. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అన్ని చోట్ల ‘బాహుబలి2’ ని మించి నమోదయ్యాయి.
వీకెండ్ వరకు కూడా అదే జోష్ ను చూపిస్తున్న ఈ మూవీ.. 5వ రోజున కూడా రికార్డ్ కొట్టింది.
ఒకసారి 5 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
68.30 cr
సీడెడ్
34.16 cr
ఉత్తరాంధ్ర
19.36 cr
ఈస్ట్
10.35 cr
వెస్ట్
09.18 cr
గుంటూరు
13.07 cr
కృష్ణా
09.94 cr
నెల్లూరు
05.87 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
170.23 cr
తమిళ్ నాడు
21.73 cr
కేరళ
05.35 cr
కర్ణాటక
24.67 cr
నార్త్ ఇండియా (హిందీ)
53.18 cr
ఓవర్సీస్
67.60 cr
రెస్ట్
05.19 cr
టోటల్ వరల్డ్ వైడ్
347.95 cr
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.347.95 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.624 కోట్లను కొల్లగొట్టింది.మొదటి రోజు హిందీలో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రెండో రోజు నుండీ పుంజుకుంది.ప్రస్తుతం అక్కడ ఈ చిత్రం పెర్ఫార్మన్స్ బాగుందని చెప్పాలి.