తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ… ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లకు ఏమాత్రం బ్రేకులు పడలేదు. వీకెండ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ వీకెండ్ తర్వాత ఎక్కువ డ్రాప్స్ లేకుండా నిలకడగా రాణించింది. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో వీకెండ్ వరకు ఆ ఫీట్ ను సాధించింది.మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ 80 శాతం పైనే రికవరీని సాధించింది.
8 వ రోజున కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది. ఉగాది సెలవు ఉంది కాబట్టి.. సెకండ్ వీకెండ్ బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
ఒకసారి 8 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 80.89 cr |
సీడెడ్ | 38.23 cr |
ఉత్తరాంధ్ర | 21.38 cr |
ఈస్ట్ | 11.37 cr |
వెస్ట్ | 09.98 cr |
గుంటూరు | 14.13 cr |
కృష్ణా | 11.07 cr |
నెల్లూరు | 06.63 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 193.68 cr |
తమిళనాడు | 27.07 cr |
కేరళ | 08.25 cr |
కర్ణాటక | 29.30 cr |
హిందీ | 71.42 cr |
ఓవర్సీస్ | 76.38 cr |
రెస్ట్ | 05.90 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 412.00 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.412 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.748 కోట్లను కొల్లగొట్టింది.బ్రేక్ ఈవెన్ విషయంలో సందేహపడనవసరం లేదు కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రెండో వీకెండ్ అయితే భారీగా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?