ఆర్ ఆర్ ఆర్ కొరకు అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్..?

జగ్గన్న జాగ్రత్తగా చెక్కుతున్న శిల్పం ఆర్ ఆర్ ఆర్. ఒక నాటి తెలుగు వీరులైన అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవిత గాథలను స్ఫూర్తిగా కొంచెం కాల్పినికత జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్ర ప్రకటన దినం నుండి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే ఈ చిత్రం నుండి వచ్చే ప్రతి అప్డేట్ ఒక సంచలనంగా అనిపిస్తుంది. కాగా ఈ చిత్రం నుండి మరో వార్త బయటికొచ్చింది. అదేమిటనగా ఆర్ ఆర్ ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్ రాజమౌళి భారీ ఎత్తున విజువల్ ట్రీట్ గా తెరకెక్కిస్తున్నారట. విశేషం ఏమిటంటే కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ బ్రిటీష్ సైన్యంపై కలిసి యుద్ధం చేస్తారట. ఈ యుద్ధంలో వారి వీరోచిత పోరాటం, యాక్షన్ విజువల్స్ ఒళ్ళు గగ్గుర్ గొలిపేలా ఉంటాయట.

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది. చారిత్రకంగా చూసుకుంటే వీరిద్దరూ కలిసిన దాఖలాలు లేవు. కాబట్టి వీరిద్దరూ కలిసి యుద్ధం చేస్తారు అనేది నమ్మ శక్యం కాని విషయం. ఐతే రాజమౌళి ఈ పాత్రల స్పూర్తితో ఫిక్షన్ జోడించి తీస్తున్న చిత్రం కావడంతో నిజమయ్యే అవకాశం కలదు. ఏదిఏమైనా వారిద్దరూ కలిసి యుద్ధం చేస్తారు అని వింటుంటే ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడూ విడుదలవుతుందా అనే ఉత్సుకత కలుగుతుంది. డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్లుకు పైగా బడ్జెట్ తో భారీగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్ చరణ్ కి జోడిగా నటిస్తుండగా, ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎంపికైంది. అజయ్ దేవ్ గణ్ ఆర్ ఆర్ ఆర్ లో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం జులై 30న విడుదల కానుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus