Naatu Naatu Song: వైరల్ అవుతోన్న ‘నాటు నాటు’ సాంగ్ వర్కింగ్ స్టిల్స్!

దర్శకుడు రాజమౌళి సినిమాలకు జనాల్లో ఉండే క్రేజే వేరు. గ్రాండియర్ లుక్ తో సినిమాలను తీయడంతో పాటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు కూడా తన సినిమాలో ఉండేలా చూసుకుంటాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే పెట్టినట్లున్నారు. తాజాగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సెకండ్ సాంగ్ ‘నాటు నాటు’ థియేటర్లను హోరెత్తిస్తుండడంతో ఎలాంటి సందేహం లేదు.

ఇద్దరు స్టార్ హీరోలు పోటీపడుతూ చేసిన డాన్స్ కు థియేటర్లో అభిమానులు రచ్చ చేయడం ఖాయం. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ స్టెప్పులు మాములుగా లేవు. ఇక ఈ పాటలో కొన్ని మేకింగ్ సన్నివేశాలను చూపించారు. దర్శకుడు రాజమౌళితో పాటు ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా కనిపించారు. అలానే సినిమాటోగ్రాఫార్ సెంథిల్ తో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి కూడా దర్శనమిచ్చారు. ఆ ఒక్క పాట కోసమే వందల మంది పని చేసినట్లు పాట చూస్తుంటే అర్ధమవుతోంది.

పాట బ్యాక్ గ్రౌండ్ లో కనిపించిన కోట సెట్ మరింత ఆకట్టుకుంటుంది. ఈ ఒక్క సాంగ్ ప్రమోషన్స్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కానీ, సాంగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయనిపిస్తుంది. మొత్తానికి సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.. సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

 

22

23

24

25

 

26

27

28

29

30

31

32

33

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus