స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతేడాది జులైలో రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఓవర్సీస్ హక్కులు 30 నెలల క్రితమే 67 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఫారస్ ఫిల్మ్స్ అనే సంస్థ ఒకేసారి ఈ మొత్తాన్ని చెల్లించింది. అయితే చాలా నెలల క్రితం జరిగిన డీల్ కావడం, ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడటంతో ఈ మొత్తానికి నెలకు కోటి రూపాయల చొప్పున డిస్ట్రిబ్యూటర్ కు భారం పెరుగుతోంది.
ఈ డీల్ రెండు సంవత్సరాల క్రితం జరిగిన డీల్ కాగా ఓవర్సీస్ లో కనీసం 160 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది. ఆర్ఆర్ఆర్ కనీసం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను ఓవర్సీస్ లో సాధించాల్సి ఉంది. అయితే ఈ రేంజ్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను సాధించడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ మారితే ఫారస్ ఫిల్మ్స్ సంస్థకు భారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు కలెక్షన్ల విషయంలో భారీ టార్గెట్లు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆలస్యమయ్యే కొద్దీ ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారం పెరుగుతోంది. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడం కష్టమేనని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆర్ఆర్ఆర్ బృందం మరోసారి స్పందించి రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు