RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల మళ్లీ అక్కడికే వస్తుందా?

  • September 11, 2021 / 01:38 PM IST

‘రాజమౌళి సినిమా చెప్పిన సమయానికి విడుదల అవ్వదు’… ‘బాహుబలి’ నుండి టాలీవుడ్‌లో ఇదే మాట అంటున్నారు. వివిధ కారణాల వల్ల ఆ సినిమా సమయానికి రిలీజ్‌ అవ్వలేదు. అయితే ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే ఈ సారి మొత్తం బ్లేమ్‌ రాజమౌళి మీదే నెట్టేసే పరిస్థితి లేదు. కారణం కరోనా. దేశంలో కరోనా పరిస్థితులు ఇంకా సద్దుమణగకపోవడంతో… సినిమా విడుదల మరోసారి వాయిదా పడిందని తెలుస్తోంది. నిజానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను ఈ ఏడాది జనవరి 8న విడుదల చేద్దామని అనుకున్నారు.

అయితే కరోనా తొలి వేవ్‌ వల్ల సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా సాగలేదు. దీంతో సినిమాను వేసవికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ అనుకున్నట్లుగా సినిమా చిత్రీకరణ అవ్వలేదు. దీంతో అక్టోబరు 13న సినిమా విడుదల చేస్తామని మళ్లీ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా అప్పటికి కూడా సిద్ధం అవ్వదని తెలుస్తోంది. ఈ మాట చాలా రోజుల నుండి వినిపిస్తున్నా…

చిత్రబృందం మాత్రం గమ్మునుంటోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ముందుగా అనుకున్న తేదీకే సినిమా వస్తుంది అంటున్నారు.అంటే అక్టోబరు 13 అనుకునేరు. కాదు కాదు జనవరి 8. అవును వచ్చే ఏడాది జనవరి 8కి సినిమా విడుదల చేస్తారని కొత్త పుకార్ల సారాంశం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus