RRR Movie: ఎన్టీఆర్- చరణ్ టు ఒలీవియా మోరిస్.. ఎవరికి ఎంతెంతంటే..!

‘బాహుబలి'(సిరీస్) తర్వాత ఇండియన్ స్క్రీన్స్ పై ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ ఏది అంటే సందేహపడకుండా అందరూ చెప్పే మాట ‘ఆర్.ఆర్.ఆర్’. మార్చి 25న అంటే మరో 4 రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాంచరణ్… అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. ఇక చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కనిపించబోతుంది.

వీరితో పాటు అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది అల్లూరి, భీమ్ ల జీవితాల ఆధారంగా తెరకెక్కిన మూవీ కాదు.అసలు వారు కలిసినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. చాలా వరకు ఫిక్షన్ యాడ్ చేసి తీసిన మూవీ అని దర్శకుడు రాజమౌళి ముందుగానే చెప్పాడు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తే తెర పై నటీనటులు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది అలాగే తెర వెనుక రాజమౌళి అలాగే టెక్నికల్ టీం పడ్డ కష్టం కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా… ఈ చిత్రానికి బడ్జెట్ ఎంత అయ్యింది. పారితోషికాలు ఎవరెవరికి ఎంతెంత అందాయి అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి పారితోషికాలు కాకుండా రూ.336 కోట్ల బడ్జెట్ అయ్యింది.

2)చరణ్ సరసన నటించిన ఆలియా భట్ కు రూ.10 కోట్ల పారితోషికం అందింది.

3)కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కు రూ.10 కోట్ల పారితోషికం అందింది.

4)ఎన్టీఆర్ సరసన నటించిన ఒలీవియా మోరిస్ కు రూ.1 కోటి పారితోషికం.

5) సినిమా ప్రారంభంలో వచ్చే శ్రీయ పాత్ర కోసం రూ.1 కోటి అందజేసారట.

6)మరో ముఖ్య పాత్ర పోషించిన సముద్ర ఖనికి రూ.0.50 కోట్లు పారితోషికం అందిందట.

7)మిగతా విదేశీ తారాగణానికి రూ.3 కోట్లు పారితోషికం అందిందట.

8)చిన్న చిన్న ఆర్టిస్ట్ లు మరియు టెక్నీకల్ టీం అంతటికీ కలుపుకుని రూ.30 కోట్లు ఖర్చయ్యిందట.

9) వి.ఎఫ్.ఎక్స్ మరియు ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతటికీ కలిపి రూ.100 కోట్లు ఖర్చు చేశారు.

10)మిగతా మేకింగ్ కాస్ట్ కి రూ.180 కోట్లు ఖర్చు అయ్యింది.

11)దర్శకుడు రాజమౌళి పారితోషికం రూ.20 కోట్లు.

12) అల్లు సీతారామరాజుగా చేసిన రాంచరణ్ పారితోషికం రూ.25 కోట్లు

13)కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ పారితోషికం రూ.25 కోట్లు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus