RRR Movie: చిక్కుల్లో ‘ఆర్ఆర్ఆర్’.. రాజమౌళి ఏం చేస్తాడో..!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొత్తం రాజమౌళి-దానయ్య చేతుల్లోనే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. మరో నెల రోజుల్లో సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. కాబట్టి తమకు ఎప్పుడు నచ్చితే అప్పుడు సినిమాను రిలీజ్ చేసుకుంటారని అంతా అనుకుంటున్నారు. కానీ నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అనేది ఇప్పుడు మేకర్స్ చేతుల్లో లేదు. పెన్ స్టూడియోస్ చేతిలో ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ను మరో నాలుగు రోజుల్లో రిలీజ్ చేయాల్సిందేనట. అగ్రిమెంట్ అలానే రాసుకున్నారని సమాచారం. అంతా సంతకాలు కూడా పెట్టారు.

అడ్వాన్స్ పేమెంట్ కూడా చేతులు మారింది. అగ్రిమెంట్ లో చెప్పినట్లుగా చేయకపోతే.. ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్.. రివర్స్ లో పెన్ స్టూడియోస్ కు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. లేకపోతే తాము ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పెన్ స్టూడియోస్ సంస్థ కూడా.. జీగ్రూప్ కు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెన్ స్టూడియోస్ నుంచి భారీ మొత్తంలో ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను జీ గ్రూప్ దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్, స్టార్ మా కూడా రైట్స్ దక్కించుకున్నప్పటికీ మేజర్ పార్ట్ మాత్రం జీ గ్రూప్ చేతుల్లోనే ఉంది.

కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రాబోయే నాలుగు నెలల్లో రిలీజ్ చేయకపోతే నిర్మాతకు వడ్డీల భారం తప్పదు. మరోపక్క ‘ఆర్ఆర్ఆర్’కి రిలీజ్ డేట్ దొరకడం లేదు. మరి రాజమౌళి ఏం చేస్తారో చూడాలి!

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus