రాజమౌళి తాను తీసే ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంపొండించడం కోసం ప్రాకులాడతాడనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాతో చేసేది అదే. ఇప్పుడు మన తెలుగు సినిమాకి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందంటే అందుకు కారణం రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి “ఆర్.ఆర్.ఆర్”తో పాన్ ఇండియన్ ఫిలిమ్ రూపొందించాలని ఫిక్స్ అయిన రాజమౌళి కథ-కథనం పరంగా మాత్రమే కాక టెక్నికల్ గానూ సినిమా స్థాయిని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు.
అందులో భాగంగానే “ఆర్.ఆర్.ఆర్” సినిమాలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం 130 అడుగుల ఎత్తులో కెమెరాను ఫిక్స్ చేశాడు రాజమౌళి. సాధారణంగా అంత ఎత్తు షాట్స్ కోసం డ్రోన్ కెమెరా వాడుతుంటారు ఫిలిమ్ మేకర్స్. కానీ.. రాజమౌళి మాత్రం సెంథిల్ సహాయంతో 130 ఎత్తున క్రేన్ ఏర్పాటు చేసి మరీ కెమెరా ఫిక్స్ చేశాడు. ఈ యాక్షన్ బ్లాక్ లో కనిపించేది ఎన్టీఆర్ అని, సినిమాకి ఈ యాక్షన్ బ్లాక్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకొంటున్నారు జనాలు. మరి మన రాజమౌళి ఈసారి ఏం మౌళీ చేస్తాడో చూడాలి