RRR Promotions: జక్కన ప్రచారం షురూ చేస్తున్నారట.. భారీగా!

  • October 27, 2021 / 12:00 PM IST

వచ్చే ఏడాది సంక్రాంతి భారీ చిత్రాలతో భారీగా ఉండబోతోంది అని అందరూ అనుకున్నారు. అయితే ‘ఆర్‌ఆర్ఆర్‌’ రాకతో మొత్తం సీన్‌ మారిపోయింది. అయితే సినిమా ప్రచారం ఇంకా ప్రారంభించకపోయేసరికి అభిమానుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి. అయితే దీనికి తెరదించుతూ ప్రచారం ప్రారంభించాలని రాజమౌళి నిర్ణయించారని తెలుస్తోంది. అంతేకాదు దీనికి దుబాయ్‌ని తొలి వేదికగా చేసుకుంటున్నారనే ప్రచారమూ నడుస్తోంది. ప్రస్తుతం దుబాయిలో టీ20 ప్రపంచకప్‌ నడుస్తోంది. దీంతో ప్రపంచం మొత్తం దుబాయ్‌ ఫీవర్‌ నడుస్తోంది.

దీన్ని క్యాష్‌ చేసుకునేలా రాజమౌళి ప్రయత్నాలు సాగుతున్నాయని టాక్‌. ఆ వేదికను తన సినిమా ప్రచారం కోసం వాడుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉందని టాక్‌. అయితే దీని సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని రాజమౌళి కోర్‌ టీమ్‌ ప్రయత్నమట. ఒకవేళ ఇది ఓకే కాకపోతే దుబాయ్‌లో భారీ ఎత్తున వేడుక నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నారట. దీని కోసం ఇప్పటికే నిర్మాత డీవీవీ దానయ్య మంతనాలు ప్రారంభించారనే టాక్‌ కూడా ఉంది.

అక్కడ ఈవెంట్‌ చేసి దానిని లైవ్‌ ద్వారా మన దేశంలో టెలీకాస్ట్‌ చేస్తారట. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మీద దృష్టి పడేలా చేయొచ్చు అనేది జక్కన్న అండ్‌ కో ఆలోచనట. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus