Baahubali, RRR: ‘ఆర్.ఆర్.ఆర్’ బ్రేక్ చేయాల్సిన ‘బాహుబలి’ రికార్డులు..

  • March 21, 2022 / 03:58 PM IST

‘బాహుబలి’ సృష్టించిన సంచలనాల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన మూవీ ఇది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో సందేహం లేదు. అప్పటి వరకు తెలుగు సినిమా మార్కెట్ రూ.70 కోట్లు అన్నట్టే ఉండేది. రూ.50 కోట్ల బడ్జెట్ తో ఓ మూవీ చేస్తే అది అద్భుతం అన్నట్టు చూసేవాళ్ళు. ‘మగధీర’ కూడా రూ.40 కోట్ల నుండీ రూ.50 కోట్ల మధ్యలో రూపొందిన మూవీనే.! అలాంటిది ‘బాహుబలి’ చిత్రం రూ.146 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది అంటే అంతా షాక్ అయ్యారు. రాజమౌళి తీసిన సినిమాలు అన్నీ అప్పటివరకు హిట్టే. కానీ ప్రతీసారి హిట్ వస్తుంది అనుకోవడం అతిశయోక్తి అవుతుంది.పైగా పక్క రాష్ట్రాల్లో ఉన్న జనాలకి తెలుగు సినిమా అంటే నమ్మకం ఉండదు కాబట్టి.. పెట్టిన బడ్జెట్ అంతా కలెక్షన్ల రూపంలో వెనక్కి ఎలా తిరిగొస్తుంది.? ఇలాంటి ప్రశ్నలు ఎంతో మందిలో నెలకొన్నాయి.

కానీ బాహుబలి ది బిగినింగ్ కానీ బాహుబలి2 కానీ విడుదలైన మొదటి రోజు నుండీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వచ్చాయి. బాహుబలి రికార్డులను ఇప్పటివరకు ఏ స్టార్ హీరో టచ్ చేయలేకపోయాడు. ఇది అసాధ్యమని తెలుసుకుని ట్రేడ్ పండితులు కూడా ‘నాన్ బాహుబలి’ అనే పేరుతో ఇండస్ట్రీ హిట్లని లెక్కేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వరుసగా టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి అంటే దానికి కారణం ‘బాహుబలి’ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి బాహుబలి రికార్డులని మళ్ళీ రాజమౌళినే బ్రేక్ చేస్తాడు.. ఆయన సినిమాలకి తప్ప ఆ ఫీట్ ను సాధించడం మరో హీరోకి సాధ్యం కాదు అని జనాలు భావిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ రూపంలోనే అది జరగాలి. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు అది సాధ్యమవుతుందా.? అంటే అవును అనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.మార్చి 25న విడుదల కాబోతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ బ్రేక్ చేయాల్సిన ‘బాహుబలి’ రికార్డులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)అడ్వాన్స్ బుకింగ్స్ లో చరిత్ర సృష్టించింది బాహుబలి. టికెట్ బుక్ చేసుకుందాం అంటే సైట్ డౌన్ అయిపోయేది. వరుసగా వారం రోజుల పాటు ఈ చిత్రం టికెట్లు బుక్ అయిపోయాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.

2)8000 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన మూవీ. అప్పటివరకు ఇదే హైయెస్ట్.

3)మొదటిరోజు రూ.121 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

4)మొదటి రోజు డబ్బింగ్ వెర్షన్ తోనే హిందీలో హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన మూవీ ఇది.

5)మొదటి వారం రూ.800 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసిన మూవీ.

6)యూ.ఎస్లో అత్యథిక గ్రాస్ వసూళ్ళను రాబట్టిన మూవీ..!

7)5 రోజుల్లోనే రూ.710 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ.

8)ఇండియాలోనే అత్యథిక గ్రాసర్ గా నిలిచిన మూవీ.

9)వరల్డ్ వైడ్ గా ఫాస్ట్ గా రూ.600 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి మూవీ.

10)రూ.300 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి మూవీ.

11)నార్త్ లో మొదటి వీకెండ్ కు హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన మూవీ ఇది.

12)కేరళలో వేగంగా రూ.20 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ.

13)ఆదివారం రోజున అత్యథికంగా రూ.46.5 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ.

14) హిందీలో డబ్బింగ్ మూవీ అయినప్పటికీ మొదటి 3 రోజుల్లో రూ.128 కోట్లు కలెక్ట్ చేసింది.

15) వీకెండ్ కే రూ.526 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసిన మూవీ.

16) ఫాస్ట్ గా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన మూవీ.

17) రెండో రోజు రూ.102 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఇదే.

18) మొదటి రోజు తెలుగుతో పాటు మలయాళం, తమిళ్ లో కూడా అత్యథిక గ్రాసర్ గా నిలిచిన మూవీ..!

ఇది.. ‘ఆర్.ఆర్.ఆర్’ ముందుంచిన ‘బాహుబలి'(సిరీస్) రికార్డులు. ‘ఆర్.ఆర్.ఆర్’ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ కు ఈ రికార్డులను బ్రేక్ చేయడం కష్టమేమి కాదు. ‘బిగ్గర్ దేన్ బాహుబలి’ అని రాజమౌళి కూడా అనేశాడు కదా..!కాబట్టి వారు వన్ సైడ్ అయిపోయినట్టే… మనం హైలెట్స్ చూస్తున్నట్టు చూడడమే మిగిలింది..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus