‘ఆర్.ఆర్.ఆర్’ మొదటి ప్రిఫరెన్స్ ఎన్టీఆరే నట..!

జూలై 15 నుండీ షూటింగ్ లు జరుపుకోడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసిందని సినీ ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో ఉంది. అయితే క*నా కేసులు మాత్రం ఇప్పుడు మరింతగా పెరుగుతున్నాయి… కాబట్టి ఈ టైంలో షూటింగ్ లు మొదలుపెట్టడానికి కొంతమంది భయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూతో షూటింగ్ జరుపుకోవాలి అనే నిబంధన ఎలాగూ ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ విషయంలో కూడా దర్శకుడు రాజమౌళి కొత్త ప్లాన్ అమలు చెయ్యబోతున్నాడని సమాచారం.

బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, అలియా భట్ పార్ట్ ను నవంబర్ లేదా డిసెంబర్ లో మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. వాళ్ళు కూడా ఇప్పట్లో షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోకస్ మొత్తం తారక్ పై పెట్టాడట. చరణ్ పార్ట్ ఎలాగూ అలియా భట్ తో లింక్ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ తర్వాత కూడా చరణ్ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇక చరణ్, తారక్ ల కాంబినేషనల్ సీన్స్ ను కూడా త్వరగా తీసేసి.. చరణ్ కు కాస్త బ్రేక్ ఇవ్వాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.

తరువాత ఏకధాటిగా తారక్ పార్ట్ ను చిత్రీకరించి నవంబర్,డిసెంబర్ లోపే కంప్లీట్ చెయ్యాలలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలా తారక్ ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఫ్రీ అయిపోతాడు. దాంతో త్రివిక్రమ్ మూవీని ఎన్టీఆర్ స్టార్ చేసేసే ఛాన్స్ ఎన్టీఆర్ కు ఉంటుంది. ఇక మధ్యలోనే ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్ర కు సంబంధించి వీడియో టీజర్ ను విడుదల చెయ్యడంతో పాటు.. ఎన్టీఆర్ ను బాలీవుడ్ మీడియాకి పరిచయం చెయ్యాలని కూడా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. మరి ఇది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus