Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) అనే మాస్ సినిమా రూపొందింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Ustaad Bhagat Singh Collections

‘గబ్బర్ సింగ్’ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలు ఏర్పడ్డాయి.శ్రీలీల, రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్లుగా నటించారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘దేక్ లెంగే సాలా’ ‘ఎత్తరా ఎత్తరా’ వంటి సాంగ్స్ కి మంచి అప్రీషియేషన్ లభించింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. అందువల్ల మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తీసుకుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’.కానీ రెండో రోజు నుండి డౌన్ అయ్యింది. వీకెండ్ కొంత ఓకే అనిపించినప్పటికీ తర్వాత అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు.

వీక్ డేస్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే

నైజాం 15 cr
సీడెడ్ 6.61 cr
ఉత్తరాంధ్ర 6.23  cr
ఈస్ట్ 4.81 cr
వెస్ట్ 3.32 cr
గుంటూరు 3.92 cr
కృష్ణా 3.60 cr
నెల్లూరు 1.55 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 45.04 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.45 cr
ఓవర్సీస్ 4.12 cr
టోటల్ వరల్డ్ వైడ్ 52.61(షేర్)

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి రూ.122.4 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.123 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.52.61 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.89.8 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.70.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus