కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… తాను ఉప్మా తినను అంటూ రాజు బయటకు వెళ్ళబోతూ ఉండగా బొమ్మల కోసం ఇంటి బయట వేసిన మట్టిని తొక్కుతాడు. దాంతో మట్టి ఉందని చెప్పచ్చుగా అంటూ కావ్య వైపు చూస్తాడు. ఇలా రాజ్ మట్టి తొక్కుతూ ఉండగా కనకం దంపతులు చూస్తారు.మా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలి అన్న మా ఆయన చేతుల మీద నుంచె జరుగుతుంది.అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తన కాలు మీదనే జరుగుతుంది అంటూ కావ్య తన భర్తతో కలిసి విగ్రహాలు తయారు చేయడం కోసం మట్టి తొక్కుతూ ఉంటారు.
ఇలా రాజ్ కావ్య ఇద్దరు మట్టి తొక్కుతూ ఉండగా అది చూసిన కృష్ణమూర్తి కనకం దంపతులు సంతోషపడతారు అయితే ఈ వీడియోని ఒక వ్యక్తి చాటుగా తీశారు అనంతరం రాహుల్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా వీడియో తీసిన వ్యక్తి తనకు ఫోన్ చేసి ముందు పేమెంట్ గురించి తర్వాత మాట్లాడదాం ముందు ఈ ఫోటోలు చూడు అంటూ అక్కడ రాజ్ మట్టి తొక్కుతూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు పంపించగా రాహుల్ సంతోషపడుతుంటారు అది చూసిన రుద్రాణి ఎందుకు అంత ఆనందంలో తేలిపోతున్నావు అంటూ అడగడంతో ఆ ఫోటోలు వీడియోలు రుద్రానికి చూపిస్తాడు.
ఇందాక కొడుకు గురించి మా వదిన అలా మాట్లాడింది కదా ఇప్పుడు ఇంట్లో సునామీ సృష్టిస్తాను నువ్వు ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చూడు అంటూ కొడుకుకి చెప్పిపోతుంది. కళ్యాణ్ అనామిక ధ్యాస నుంచి బయటపడటం కోసం పార్కులో కూర్చుని కవితలు రాస్తూ ఉంటాడు. అయితే ఒక కవిత కూడా సరిగా రాకపోవడంతో ఆ పేపర్లన్నీ పడేస్తూ ఉంటారు కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ పేపర్లన్నింటిని ఏరుకుంటూ ఉండగా ఎందుకు ఆ పేపర్ల ఏరుతున్నావు అని కళ్యాణ్ అడగడంతో ఈ పేపర్లన్ని అమ్మితే నాకు ఒక కిలో బియ్యం వస్తాయి సార్ అని చెబుతాడు.
దాంతో కళ్యాణ్ ఆ వ్యక్తికి డబ్బులు ఇస్తారు. అనంతరం ఆ వ్యక్తి అనామిక వద్దకు వెళ్లి మీరు తీసుకురమ్మన్న కాగితాలు తీసుకువచ్చానని చెప్పడంతో డిక్కీలో పెట్టమని అనామిక చెబుతుంది అనంతరం ఆమె కూడా తనకు కొంత డబ్బు ఇచ్చి పంపిస్తుంది. మరోవైపు రాజ్ కారులో వెళుతుండగా తనతో అంతరాత్మ మాట్లాడుతూ ఇలా ఎన్ని రోజులని కావ్యను దూరం పెడతావ్ అని అడగగా ఈ జన్మకు తనని నేను భార్యగా అంగీకరించను అని చెబుతాడు. అలా ఎలా అంగీకరించవో నేను కూడా చూస్తాను అంటూ అంతరాత్మ వెళ్ళిపోతుంది.ఇక కావున తన అత్తవారింటికి పంపించడం కోసం అప్పు ఆటో అరేంజ్ చేస్తోంది
నేను ఇంట్లో చెప్పే వచ్చాను కదా నాన్న అనడంతో నిన్ను ఇక్కడికి పంపించినందుకు వారి గౌరవానికి మేము కూడా మర్యాద ఇవ్వాలి అని కృష్ణమూర్తి చెప్పడంతో నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే మీ ఆయన మళ్లీ మా మీద అరుస్తాడు అంటూ కావ్యని తన అత్తవారింటికి పంపిస్తారు. మరోవైపు అనామిక కళ్యాణ్ రాసిన లెటర్స్ అన్ని చదువుతూ కూర్చొని ఉంటుంది అంతలోపు రుద్రాణి ఆపర్ణ వద్దకు వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోని చూపిస్తుంది.
ఒక్కసారిగా ఆపర్ణ షాక్ అవుతుంది. నేను కావ్య గురించి ఎప్పుడో చెప్పాను కానీ నువ్వే నా మాట వినలేదు ఇప్పుడు చూడు రాజ్ పరిస్థితి ఎలా తయారయ్యిందో ఈ వీడియోని సోషల్ మీడియా మొత్తం చూస్తోంది అంటూ రుద్రాణి రెచ్చగొడుతుంది.కావ్య కారణంగా చివరికి మట్టి తోక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ రాజ్ గురించి రుద్రాన్ని చెప్పడంతో అపర్ణ మాత్రం కావ్య మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?