Rudrayogi: ఆయన వయసు ఓ రహస్యం.. పాదాలతో ఆశీర్వాదం.. ఆ బాబాపై సినిమా!

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో బాబాల జీవితం ట్రెండ్‌ నడుస్తోంది. మొన్నీమధ్యే నీమ్‌ కరోలి బాబా జీవితం ఆధారంగా ‘హనుమాన్‌ అంశ్‌’ అనే సినిమా వచ్చింది. బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది. ఇప్పుడు సిద్ధ మహా యోగి దేవ్‌రహా బాబా జీవితం ఆధారంగా ‘రుద్రయోగి’ అనే సినిమా రూపొందనున్నట్లు రచయిత విక్రమ్‌ మిశ్రా ప్రకటించారు. తాను రాసిన ‘మహాదేవ్‌ అంశ్‌’ పుస్తకం ఆధారంగా, జాతీయ అవార్డు గ్రహీత రవిరాజ్‌ ముర్ము ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు.

Rudrayogi Movie

దేవ్‌రహా బాబా ఎప్పుడు జన్మించారు, జన్మ స్థలమేంటో ఎవ్వరికీ తెలియదు. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఆయన ఉత్తర్‌ప్రదేశ్ దేవరియా జిల్లాలోని ఓ పట్టణ ప్రజలకు సాధువుగా కనిపించారు. సరయూ నది సమీపంలో వెదురు మంచెను ఏర్పాటు చేసుకొని దానిపైనే నివాసం ఉండేవారు. స్థానికులు ఆయన్ను దేవ్‌రహా బాబా అని పిలిచేవారు. తన వద్దకు వచ్చేవారిని పాదాలతో ఆశీర్వదిస్తారు. క్రమంగా ఇతర ప్రాంతాల నుండి బాబాను దర్శించుకోవడానికి ప్రజలు వచ్చేవారు.

ఎప్పుడూ రామ నామ స్మరణ చేస్తూ ఒంటరిగా గడపడానికే బాబా ఇష్టపడేవారు. కొన్నాళ్ల తరువాత బాబా వృందావన్‌కు తరలివెళ్లారు. అక్కడా యమునా నది సమీపంలో మంచెను నిర్మించుకొని నివసించారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి కొన్నాళ్ల పాటు అక్కడే ఉండిపోయేవారు. ప్రజలు ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలిచేవారు. ఒడిశాలోని గంజాంలో పూర్ణేశ్వరి మా తారా తరిణి శక్తి పీఠం ప్రాంతంలో ఆయన్ను చమత్కారీ బాబా అని పిలిచేవారు.

బాబాను విశ్వసించేవారిలో దేశాన్ని ఏలిన దిగ్గజ నేతలు ఉండటం విశేషం. మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ , కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్‌ ఆయన్ను దర్శించుకునేవారు. ఎన్నికల సమయంలో నేతలు వచ్చి, గంటల పాటు వేచి ఉండి దేవ్‌రహా బాబా ఆశీర్వాదాలు తీసుకునేవారు.

బాబా జనబాహుళ్యంలోకి రావడానికి ముందు హిమాలయాల్లో కఠినమైన ఆధ్యాత్మిక దీక్షలు చేశారని, ఆకలిని జయించే కేచరి ముద్రపై పట్టు సాధించారని, దానివల్లే సాధారణ మానవుల కన్నా సుదీర్ఘ కాలం జీవించారని ప్రచారంలో ఉంది. అయితే బాబా దీర్ఘకాలిక జీవితంపై పక్కా సమాచారమేదీ లేదు. జూన్‌ 19, 1990న బాబా మహా సమాధిలోకి వెళ్లి జీవితాన్ని ముగించారు.

రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus