Ruhani Sharma: సైంధవ్ లో నటించనున్న రుహాని శర్మ!

ఇప్పటి వరకూ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేశ్‌ రూట్‌ మార్చారు. ‘రానా నాయుడు’ సిరీస్‌తో విభిన్న పాత్రకు శ్రీకారం చుట్టిన ఆయన తాజాగా నటిస్తున్న సైంధవ్‌’ చిత్రంలో మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. వెంకటేశ్‌ నటిస్తున్న 75వ చిత్రం కావడం ఓ విశేషం అయితే ఆయన చేస్తున్న తొలి ప్యాన్‌ ఇండియా చిత్రం కావడం మరో విశేషం. ‘హిట్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ బయటికొచ్చింది. ‘హిట్‌’ సినిమాతో ఆకట్టుకున్న రుహాని శర్మ ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఆమె క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. డాక్టర్‌ రేణు పాత్రలో రుహాని నటిస్తున్నట్లు పోస్టర్‌లో చెప్పారు. మెడలో స్టెతస్కోప్‌తో సీరియస్‌ లుక్‌లో రూహానీ కనిపించారు. ఆమె కథానాయికగా తీసుకోవడంపై శైలేష్‌ ట్వీట్‌ చేశారు.

‘నా తొలి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రుహానీతో మరోసారి వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్‌లకు స్కోప్‌ ఉన్నట్లు మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. గతవారం శ్రద్థా శ్రీనాథ్‌ ను ఓ కథానాయికగా ఎంపిక చేసినట్లు లుక్‌ విడుదల చేసి తెలిపారు. ఈరోజు రుహానీ శర్మ ఓ కథానాయికగా అని ప్రకటించారు. మూడో హీరోయిన్‌ ఎవరా అని నెట్టింట చర్చ మొదలైంది.

త్వరలోనే ఆ విషయాననిఇ్న కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వైజాగ్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్‌ 22న ఈ చిత్రం ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus