Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

తిరుమలలో భక్తులు ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? ఏం చేయడకూడదు లాంటి ప్రవర్తనా నియమావళి ఉంటుంది. అన్నింటికీ మించి భక్తితో ఆ వేంకటేశ్వర స్వామిని కొలవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భక్తులు తిరుమలలో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొన్ని సూచనలు చేస్తూ వస్తోంది. వాటిని అతిక్రమించిన వారికి స్పష్టంగా వివరిస్తున్నారు కూడా. అందులో సినిమా తారల వెంట పరుగులు పెట్టొద్దు అని కూడా యాడ్‌ చేయాలేమో.

Manasa Varanasi

యువ కథానాయిక మానస వారణాసి ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవాలయం నుండి ఆమె బయటకు వస్తుంటే సెల్ఫీలు తీసుకోవడానికి కొంతమంది వెంటపడ్డారు. ఆమె వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నా.. వదలకుండా పరుగులు పెడుతూనే ఉన్నారు. ఆమె ఏదోలా బయటకు వచ్చేసి కారు ఎక్కి వెళ్లిపోయింది. అయితే తిరుమల లాంటి పుణ్య క్షేత్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం ఎంత వరకు కరెక్ట్‌ అనేది సమాజం ఆలోచించుకోవాలి.

సినిమా తారల విషయంలో ప్రజల్లో ఆ ఆసక్తి ఉంటుంది. అయితే ఎక్కడ ఉన్నారు అనే స్పృహ ఉండాలి. ఇవి లేకపోతే సెలబ్రిటీలు ఇబ్బంది పడతారు. సెలబ్రిటీలు ఇలా బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదనే విషయాన్ని గుర్తించాలి. సెలబ్రిటీలతో ఫొటోలు దిగి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకుంటే గొప్ప అని జనాలు ఫీల్ అయితే.. ఆ బిహేవియర్‌ వల్ల సెలబ్రిటీలు ఎంతగా ఫీల్‌ అవుతారో ఆలోచించాలి.

ఇక మానస వారణాసి గురించి చూస్తే.. 2020లో మిస్ ఇండియా 2020లో విన్నర్‌ ఆమె. మిస్ వరల్డ్ 2022లో పోటీపడి టాప్ 13లో నిలిచింది. 2024లో ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో సక్సెస్ అందుకుంది.

 ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus