సంగీత – విజయ్ – త్రిష.. ప్రస్తుతం తమిళనాడులో ఇదే చర్చ నడుస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ముందే ఈ చర్చ ఉన్నా.. ఆయన పాలిటిక్స్‌లోకి వచ్చాక జోరు పెరిగింది. ఒకప్పుడు ఎవరో ఒకరు చర్చించుకునే టాపిక్.. మీడియాకి ఎక్కంది. దానికి కారణం రాజకీయ నాయకులు తమ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తూ రావడమే. ఇది వ్యక్తిగత విషయం అని కొందరు అనడం, కాదు అని మరికొందరు అనడంతో ఆ చర్చ ఎన్నికల్లో కీలకంగా మారింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే విజయంలో ఒక విధంగా ఈ అంశం కారణంగా ఏర్పడిన సానుభూతే కారణం అని కూడా అంటారు. ఆ విషయం పక్కన పెడితే.. మొన్నీ మధ్యే ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ టాపిక్ ఇంకా పూర్తవ్వలేదు అనే క్లారిటీ వచ్చేసింది. తమిళనాడులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంల సందర్భంగా జరిగిన సన్నివేశాలు, యాక్షన్ – రియాక్షన్‌లే కారణం. ఈ కార్యక్రమానికి సీఎం హోదాలో విజయ్ హాజరయ్యారు.
అదే కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులతో కలసి ప్రముఖ కథానాయిక త్రిష కూడా వచ్చారు. రావడం కాదు.. వారితోపాటు కూర్చొని అందరికీ అభివాదం చేస్తూ కనిపించారు. అలా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ కార్యక్రమానికి వచ్చేటప్పుడు అందరికీ అభివాదం చేస్తుండగా.. ప్రతిగా త్రిష లేచి నిలచ్చుని సెల్యూట్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో విజయ్ ప్రమాణ సీఎంగా ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా అతని తల్లిదండ్రులతో పాటు త్రిష కార్యక్రమానికి వచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి సందడే. కాస్త భావోద్వేగాలు కూడా కనిపించాయి. ఇటీవల విజయ్ భర్త సంగీత.. విడాకుల కేసు వెనక్కి తీసుకున్న ఈ సమయంలో త్రిష ఇలా రావడం ఆసక్తికరంగా మారింది. అసలు విజయ్ ఏమనుకుంటున్నారు? ఈ ముక్కోణపు బంధాల కథేంటి అనేది తెలియాలి.