నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘రూలర్’. వీరి కాంబినేషన్లో .. గతంలో వచ్చిన ‘జై సింహా’ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలవడంతో ఈ చిత్రం పై కూడా అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండో రోజు నుండీ ఈ చిత్రాన్ని పట్టించుకున్నవాళ్ళే లేరు. మాస్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని వదిలేసారు.
ఇక ‘రూలర్’ 13 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
| నైజాం | 2.08 cr | 
| సీడెడ్ | 2.16 cr | 
| ఉత్తరాంధ్ర | 0.60 cr | 
| ఈస్ట్ | 0.55 cr | 
| వెస్ట్ | 0.44 cr | 
| కృష్ణా | 0.45 cr | 
| గుంటూరు | 1.55 cr | 
| నెల్లూరు | 0.34 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.14 cr | 
| ఓవర్సీస్ | 0.56 cr | 
| వరల్డ్ వైడ్ టోటల్ | 9.89 cr (share) | 
‘రూలర్’ చిత్రానికి 24 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.89 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 14.2 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అదీ ఎలాగూ సాధ్యం కాదనే చెప్పాలి.. ఇప్పటికే చాలా థియేటర్స్ నుండీ ‘రూలర్’ చిత్రాన్ని తొలగించారు. ఇక న్యూ ఇయర్ సెలవు రోజున కూడా క్యాష్ చేసుకోలేకపోయింది ఈ చిత్రం. ఇక ఫుల్ రన్లో 10 కోట్ల షేర్ మార్క్ అయినా దాటుతుందా అనే కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి.
Click Here to Read Ruler Movie Review
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!