Katrina Vicky: విక్కీ – కట్రినా పెళ్లికి రూల్స్‌ చూశారా!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ స్టార్స్‌ వివాహాలు చాలా సీక్రెట్‌గా చేసుకుంటున్నారు. పెళ్లికి వారం ఉందనగా, లేదంటే రెండు, మూడు రోజులు ఉందనగా వివరాలు బయటికొస్తున్నాయి. అలా విక్కీ కౌశల్‌, కట్రినా కైఫ్‌ పెళ్లి గురించి కూడా చాలా ఆలస్యంగా విషయాలు బయటికొస్తున్నాయి. అంతేకాదు ఈ పెళ్లి గురించి వారు తీసుకుంటున్న శ్రద్ధ, పెడుతున్న కండిషన్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఆ మధ్య మొబైల్స్‌ వద్దంటూ కండిషన్‌ పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మొత్తంగా ఏడు పాయింట్లు బయటికొచ్చాయి.

అతి కొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో డిసెంబర్‌ 7 నుండి 9 వరకు కట్రినా – విక్కీ పెళ్లి వేడుకలు జరుగుతాయని టాక్‌. రాజస్థాన్‌లోని ప్రైవేట్ ప్లేస్‌ దీనికి వేదికైంది. ఈ నేపథ్యంలో కట్రినా-విక్కీ పెళ్లిపై ఓ ఆసక్తికరమైన అంశం వైరల్‌గా మారింది. అతిథుల విషయంలో వధూవరులు పెట్టిన కొన్ని నిబంధనలే ఆ అంశం. తమ పెళ్లికి వచ్చేవాళ్లు ఈ ఏడు రూల్స్‌ పాటించాలని కోరుతున్నారట.

ఇంతకీ వాళ్లు పెట్టిన రూల్స్‌ ఏంటంటే…

1. మా పెళ్లి వివరాలను ఎవరికీ చెప్పకూడదు

2. ఫొటోలు, సెల్ఫీలకు అనుమతి లేదు

3. పెళ్లికి సంబంధించి ఎలాంటి వివరాలు సోషల్‌ మీడియా షేర్‌ చేయకూడదు

4. వెడ్డింగ్‌ లొకేషన్‌ వివరాలు కూడా ఎవరికీ చెప్పకూడదు

5. వివాహ వేదిక వద్దకు వచ్చాక… బయటి వాళ్లతో కాంటాక్ట్‌లో ఉండకూడదు

6. వెడ్డింగ్‌ ప్లానర్స్ అనుమతి తీసుకున్న తర్వాతే ఆ ఫొటోలు షేర్‌ చేయొచ్చు

7. వివాహ వేదిక వద్ద ఎలాంటి రీల్స్‌, స్టోరీస్‌ చేయకూడదు

ఈ రూల్స్‌ విషయంలో సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇలా ఎలా చెబుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే పెళ్లి అనేది వాళ్ల పర్సనల్‌ విషయం. వాళ్లకు నచ్చినట్లు చేసుకుంటారు అని మరికొంతమంది అంటున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus